ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మండల స్థాయి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు బిజెపి మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ తెలిపారు. ఈ సందర్భంగా రాయపాటి మురళీమోహన్ మాట్లాడుతూ గత ఎన్నో సంవత్సరాల నుంచి సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా మండల కేంద్రమైన పాములపాడులోనీ, శ్రీ చౌడేశ్వరి దేవాలయం ఆవరణంలో ఈనెల-13న ముగ్గుల పోటీలు మధ్యాహ్నం 3 గంటల నుండి పోటీలు ప్రారంభమవుతాయన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు పట్టు చీరలు, చీరలు బహుమతులుగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనే ప్రతి మహిళలకు "గిఫ్ట్ బహుమతులు" అందజేస్తామని తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనే మహిళలు 8686672818 నెంబర్ కు ఫోన్ చేసి తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.
Admin
E Nivas News