Saturday, 25 April 2026 10:57:10 PM
# ఆర్టీసీ కార్మికులు అధైర్యానికిలోనుకావద్దు # తెలంగాణ రాష్ట్ర సేన ద్వారా ప్రజలకు న్యాయం చేస్తాం.. # ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుంది # ఎదురుపాడు చెంచు కాలనీలకు మౌలిక వసతులు కల్పించండి # అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు # కెసిఆర్ లేకపోతే కవిత ప్రస్తా వన ఉండేదా? # సిద్దేశ్వరం చెంచులను ఐటీడీఏలో చేర్పించండి # స‌జ్జ‌నార్‌కు పదోన్నతి.. # హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు..! రేవంత్ రెడ్డి కుట్రలకు చెక్ పెట్టిన న్యాయస్థానం.. # యేసు పునరుత్థాన జాతరకు వేళాయె.. # మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సత్యనారాయణ పటేల్ # ఆర్టీసీ కార్మికుల మరణాలకు రేవంత్ రెడ్డి సర్కారే పూర్తి బాధ్యత వహించాలి.. # ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాం.. # ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల సీఎం సంతాపం.. # ప్రజలకు తెలిసేలా వాస్తవాలను ప్రచురించాలి... # వడదెబ్బతో ఫోటోగ్రాఫర్ మృతి # ప్రజా పాలన ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు # కష్టపడి చదివి ఉన్నత స్థా నాలకు వెళ్లాలి # నంద్యాల పట్టణంలో మే,-9న జరిగే దళిత క్రైస్తవుల గర్జన' పోస్టర్ విడుదల చేసిన నంద్యాల ఎంపీ-డాక్టర్ బైరెడ్డి శబరి # ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు:- సిపిఐ(ఎంఎల్) లిబరేషన్

బెంగళూరు బోర్డు పరీక్షల్లో పాములపాడు విద్యార్థిని ప్రతిభ

కరస్పాండెంట్ ఆర్ఎస్ఆర్.గోపాల్

Date : 22 April 2026 10:15 PM Views : 278

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నంద్యాల జిల్లాలోని, పాములపాడు గ్రామానికి చెందిన రాయపాటి రాఘజ్ఞపిక కర్ణాటక ప్రీ-యూనివర్సిటీ బోర్డు పరీక్షల్లో అసాధారణ ప్రతిభ కనబరిచారు. బెంగళూరులోని ప్రతిష్టాత్మక మౌంట్ కార్మల్ పీ యు కాలేజీలో పి.సి.ఎం.ఈ కోర్స్ లో ఫిజిక్స్ , కెమిస్ట్రీ , మాథమాటిక్స్ , ఎలక్ట్రానిక్స్ కోర్సు చదువుతున్న రాగ జ్ఞాపిక, బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో తన మేధస్సును చాటుకున్నదని శ్రీ వివేకానంద విద్యా విహార్ హైస్కూల్ కరస్పాండెంట్ ఆర్.ఎస్.ఆర్. గోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఆర్. గోపాల్ మాట్లాడుతూ కర్ణాటక ప్రీ యూనివర్సిటీ బోర్డు ఎగ్జామ్స్ లో విజయకేతనం ఎగురవేశారు . ఎలక్ట్రానిక్స్ లో 100/100 పర్ఫెక్ట్ స్కోరు సాధించి గ్రామీణ విద్యార్థులు సైతం నగర ప్రాంత విద్యార్తులతో పోటీ పడి చదువగలమని 91% తో 547/600 మార్కులు సాధించి నిరూపించారు. గ్రామీణ ప్రాంతం నుండి నగర విద్యార్థులకు ధీటుగా రాణిస్తూ ఎలక్ట్రానిక్స్ వంటి క్లిష్టమైన సబ్జెక్టులో 91%తో నూటికి నూరు మార్కులు సాధించడం విశేషం. *అభినందనల జల్లు* రాగ జ్ఞపిక సాధించిన ఈ విజయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేసారు. శ్రీ వివేకానంద విద్యా విహార్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరస్పాండెంట్, తల్లిదండ్రులు రాయపాటి గోపాల్ - రాయపాటి.శ్రీదేవి లు, మండల విద్యాధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులు, సామాజికవేత్తలు అభినందించారు. ముఖ్యంగా ఆమె బెంగుళూరు లో డిస్టిక్షన్ సాధించి పునాది వేసిన బెంగళూరు మౌంట్ కార్మేల్ ప్రీ యూనివర్సిటీ లో పి.సి.ఎమ్.ఈ. ఎలక్ట్రానిక్స్ ఉపాధ్యాయులు స్మితాపాల్, పావన, లత, రేస్మా, అమృత, జోష్ణ, కవిత, రోజ్ మేరీ, సుజాత ఉపాధ్యాయ బృందం ప్రోత్సాహం వల్లే పిసియం ఈ ప్రి యూనివర్సిటీ ఎగ్జామ్స్ లో డిస్టిక్షన్ సాధించానని పాములపాడు విద్యార్థి రాయపాటి రాగ జ్ఞాపిక ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదములు తెలిపారు. ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టులో 100/100 సాధించడానికి ఎంతో ప్రోత్సాహం అందించిన స్మితా పాల్ కు ఎప్పటికి మర్చిపోలేని జ్ఞాపకమని విద్యార్ధి రాగ జ్ఞాపిక విద్యా స్ఫూర్తిని వ్యక్తం చేసారు. పాములపాడు శ్రీ వివేకానంద విద్యా విహార్ హైస్కూల్ ఉపాధ్యాయ బృందం బాలకృష్ణమ్మ , షాజహాన్, సురేంద్ర, నారాయణ, హబీబుల్లా, రామస్వామి, విజయ్, జయలక్ష్మమ్మ, పుష్ప, రాణి కళావతి, గాయత్రీ, శ్రీలక్ష్మి పాఠశాల సిబ్బంది విద్యార్థిని ప్రత్యేకంగా అభినందిస్తూ, రాగ జ్ఞపిక భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. "లక్ష్యం స్పష్టంగా ఉంటే భౌగోళిక సరిహద్దులు అడ్డంకి కావని రాగ జ్ఞాపిక నిరూపించింది. ఎలక్ట్రానిక్స్‌లో 100/100 మార్కులు, మొత్తం 547/600 మార్కులు బెంగళూరు మౌంట్ కార్మల్ కాలేజీలో చదువుతూ, బెంగుళూరు మౌంట్ కార్మల్ పి యూ కాలేజ్ టాప్-5 లో 91% మార్కులతో నిలిచారు. మండల విద్యాధికారులు, సామాజికవేత్తలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు రాగ జ్ఞాపికకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :