ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : ఆత్మకూరు పట్టణంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నందికొట్కూరు పట్టణంలో ఎమ్మెల్యే గిత్త.జయసూర్య లు స్వాతి కిరణం & మెట్రో ఆంధ్ర తెలుగు దినపత్రికల క్యాలెండర్లను నంద్యాల జిల్లా ఇంచార్జ్ ఎం.రాము గౌడ్, తదితర నాయకులతో, కార్యకర్తలతో, అధికారులతో కలిసి విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భముగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య లు మాట్లాడుతూ దేశ స్వాతంత్రం రాకముందు నుండి వార్తాపత్రికలు మారుమూల ప్రాంతాల నుండి ప్రపంచ దేశాల వరకు ప్రతి సమాచారాన్ని ప్రజలకు చేరవస్తాయన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో కూడా వార్త పత్రికలు ప్రముఖ పాత్ర పోషించాయన్నారు. ఏ వ్యక్తి గొప్ప వ్యక్తి కావాలంటే, పై స్థాయికి ఎదగాలంటే పత్రికలే కీలకమన్నారు. ఎక్కడ అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, విపత్తులు ఏమి జరిగినా కూడా ప్రతి సమాచారం ఈ వార్త పత్రికల ద్వారానే తెలుసుకుంటున్నామన్నారు. కనుక ప్రతి ఒక్కరూ వార్తా పత్రికలను ఆదరించాలని అప్పుడు అవి మన అభివృద్ధికి పూల బాటలు వేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు రూలర్ సీఐ-సుబ్రహ్మణ్యం, సోషల్ మీడియా ప్రతినిధులు చంద్రశేఖర్, కే.నాగన్న, పోలీస్ సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News