Thursday, 30 July 2026 03:05:15 PM
# మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం

ఉల్లాస్ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతానికి నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ

ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ‌

Date : 06 February 2026 09:41 PM Views : 122

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : అక్ష‌రాంధ్ర కార్య‌క్ర‌మాన్ని స‌ద్వినియోగం చేసుకొని నిర‌క్ష్య‌రాస్యులు అక్ష‌రాస్యులుగా మారి.. బంగారు భ‌విత‌కు బాట‌లు వేసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ అన్నారు. ఉల్లాస్ కార్య‌క్ర‌మంలో భాగంగా విజ‌య‌వాడ అర్బ‌న్ ప‌రిధిలోని, రామ‌లింగేశ్వ‌ర‌న‌గ‌ర్‌లో నిర్వ‌హిస్తున్న అక్ష‌రాంధ్ర కేంద్రాన్ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ శుక్ర‌వారం సాయంత్రం సంద‌ర్శించారు. అక్ష‌ర జ్ఞానాన్ని పొందుతున్న మ‌హిళ‌ల‌తో మాట్లాడి, వారి అభ్య‌స‌న సామ‌ర్ధ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. కార్య‌క్ర‌మానికి హాజ‌రైన మ‌హిళ‌ల‌తో ముచ్చ‌టించి, బోధ‌నా ప‌ద్ద‌తుల‌ను ప‌రిశీలించారు. వాలంటీర్లు అందిస్తున్న శిక్ష‌ణ‌పై సంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ మాట్లాడుతూ ఎన్‌టీఆర్ జిల్లాలో వయోజనులైన దాదాపు 96 వేల మంది నిర‌క్ష‌రాస్యుల‌ను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గుర్తించడం జరిగిందని, వీరంద‌రినీ అక్ష‌రాస్యులుగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్న‌ట్లు తెలిపారు. అక్షర జ్ఞానం ద్వారా వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగా పొందే లాభాలను కలెక్టర్ వివరించారు. చదువు అనేది కేవలం అక్షరాలకే పరిమితం కాకుండా, ఆత్మవిశ్వాసం పెంపొందించి, ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుందని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పేర్కొన్నారు. ప్ర‌స్తుతం మొబైల్ ఫోన్ ద్వారా ఎన్ని సౌక‌ర్యాలు పొందుతున్నామో మ‌రోవైపు అంతే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని సైబ‌ర్ నేరాల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. అందుకే డిజిట‌ల్ లిట‌రసీ కూడా పెంపొందించుకోవాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ అద‌న‌పు క‌మిష‌న‌ర్ డాక్టర్ డి.చంద్ర‌శేఖ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సమాచారం డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్‌, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ చేయడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :