ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కర్నూలు పట్టణంలో డిప్యూటీ కమిషనర్ కార్యాలయము ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయనకు స్టేట్ గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యే గౌరు.చరితారెడ్డి, ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జీ.నాగముని లు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి, పూల బొకే చేతికి అందించి ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తో పాణ్యం ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని లు దేవాలయాల అభివృద్ధిపై, దేవాలయాల ఆస్తులపై ఉన్న సమస్యలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరితో పాటు జిల్లా బార్ అసోసియేషన్ నాయకులు చంద్రశేఖర్, యేసురత్నం, హరికృష్ణ, కావ్య, కనకరాజు, బాలాజీ, పాల్ మరి కొంతమంది న్యాయవాదులు పాల్గొని, మంత్రికి శుభాకాంక్షలు తెలియజేసి, అభినందించడం జరిగింది.
Admin
E Nivas News