ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : ఆత్మకూరు పట్టణంలోని, ఏకలవ్య కాలనీకి చెందిన వలి తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి & నిత్య సమాజ సేవకుడు ఆకుల సలాం మానవత్వాన్ని చాటుతూ ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. బాధలో ఉన్న కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి, చికిత్సకు ఉపయోగపడేలా తన వంతు సహాయాన్ని అందజేసి వలి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిత్య సమాజ సేవకుడు ఆకుల సలాం మాట్లాడుతూ, సమాజంలో ఆపదలో ఉన్నవారికి చేయూత అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేని కుటుంబాలకు దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చిన్న సహాయం కూడా కష్టాల్లో ఉన్న కుటుంబానికి పెద్ద అండగా నిలుస్తుందని అన్నారు. వలి కుటుంబ సభ్యులు ఆకుల సలాం అందించిన సహాయానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో అందించిన ఈ ఆర్థిక సాయం తమకు ఎంతో ధైర్యాన్ని, భరోసాను ఇచ్చిందన్నారు. స్థానిక ప్రజలు, కాలనీ పెద్దలు కూడా ఆకుల సలాం సేవాభావాన్ని అభినందిస్తూ, ఇలాంటి మానవతా సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని కొనియాడారు.
Admin
E Nivas News