Friday, 31 July 2026 09:39:13 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

సాంఘిక సంక్షేమ గురుకులాలలో పోస్టుల భర్తీకి డెమోల నిర్వహణ...

కోటూరి రామ కళ్యాణి

Date : 17 July 2026 08:32 AM Views : 94

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ చే నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ గురుకులాలలో తాత్కాలిక అధ్యాపకులు, ఉపాధ్యాయుల భర్తీకి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్,టి జి ఎస్ డబ్ల్యు ఆర్ ఐ ఈ ఎస్ సమన్వయకర్త కోటూరి రామ కళ్యాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 9 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలో ఆంగ్ల మాధ్యమంలో బోధన చేసేందుకు తాత్కాలిక బోధనా సిబ్బంది ఎంపిక కొరకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. సైన్స్, ఆర్ట్స్ కళాశాలలో అందుబాటులో ఉన్న ఖాళీల మేరకు తాత్కాలిక పద్ధతిన జూనియర్ లెక్చరర్ / పి జి టి/ టి జి టి/ స్పెషల్ టీచర్ల కొరకు ఈనెల 23వ తేదీ సాయంత్రం 4 గంటలలోగా లక్షెట్టిపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాలలో కార్యాలయ పని వేళలలో అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. 25వ తేదీన జూనియర్ లెక్చరర్, పి జి టి క్యాడర్ ఖాళీలకు, 27వ తేదీన టి జి టి, స్పెషల్ టీచర్ క్యాడర్ 2 రోజులపాటు ఉదయం 9 నుండి తరగతి బోధన పరిశీలన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జూనియర్ లెక్చరర్, పి జి టి పోస్టులకు యు జి సి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పి.జి. డిగ్రీ తో పాటు బి.ఈడి. అర్హత, టి జి టి పోస్ట్ కు యు జి సి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బి.ఎస్ సి./బి. ఎ./ బి. కాం. డిగ్రీ కనీసం 50 శాతం మార్కులతో పాటు బి. ఈడి. అర్హత కలిగి ఉండాలని తెలిపారు. అభ్యర్థులు నిర్దేశిత తేదీలలో తమ పూర్తి బయోడేటా తో పాటు దృవపత్రాల పరిశీలన కొరకు తమ విద్యార్హతలను తెలిపే ఒరిజినల్ ధ్రువపత్రాలు, ఒక జత నకలు ప్రతులను తీసుకొని లక్షెట్టిపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో సకాలంలో హాజరుకావాలని తెలిపారు. బాలికల విద్యాలయాలలో పనిచేయడానికి మహిళ అభ్యర్థులు మాత్రమే అర్హులని, ప్రకటించబడిన ఖాళీలలో ఎంపిక కమిటీ నిర్ణయానికి లోబడి మార్పులు ఉండవచ్చని తెలిపారు. జిల్లాలో 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పురుషులకు జూనియర్స్ లెక్చరర్ విభాగంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటని, జువాలజీ, సివిక్స్ సబ్జెక్టులలో ఒక్కొక్క పోస్టు, పి.జి.టి. విభాగంలో మ్యాథమెటిక్స్, బయోసైన్స్, సోషల్ స్టడీస్ లో ఒక్కొక్క పోస్టు, ఇంగ్లీష్ లో 2 పోస్టులు, టి.జి.టి. విభాగంలో బయో సైన్స్ ఒక్క పోస్టు, పార్ట్ టైం హిందీ లో 4 పోస్టులు, ఆర్ట్ టీచర్ 2 పోస్టులు, లైబ్రరీ ఒక పోస్టు ఉన్నాయని తెలిపారు. మహిళలకు జూనియర్ లెక్చరర్ విభాగంలో ఇంగ్లీష్, కెమిస్ట్రీ, సివిక్స్ సబ్జెక్టులలో ఒక్కొక్క పోస్టు, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో 2 పోస్టులు, పి.జి.టి. విభాగంలో ఇంగ్లీష్,మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులలో ఒక్కొక్క పోస్టు, టి.జి.టి. విభాగంలో మ్యాథమెటిక్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీ లలో ఒక్కొక్క పోస్టు, హిందీ పార్ట్ టైం 4 పోస్టులు, పి.ఈ.టి,పి.డి. 2 పోస్టులు, మ్యూజిక్ టీచర్, క్రాఫ్ట్ టీచర్, లైబ్రరీయన్, స్టాఫ్ నర్స్ లలో ఒక్కొక్క పోస్టు ఉన్నాయని తెలిపారు. జూన్ 27, 2026 నాడు లక్షెట్టిపేటలో నిర్వహించిన పార్ట్ టైం టీచర్స్ ఎంపిక డెమోకు హాజరైన వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థచే నడుపబడుతున్న సాంఘిక సంక్షేమ గురుకులాలలో తాత్కాలిక అధ్యాపకులు, ఉపాధ్యాయుల భర్తీకి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్,టి జి ఎస్ డబ్ల్యు ఆర్ ఐ ఈ ఎస్ సమన్వయకర్త కోటూరి రామ కళ్యాణి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 9 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలో ఆంగ్ల మాధ్యమంలో బోధన చేసేందుకు తాత్కాలిక బోధనా సిబ్బంది ఎంపిక కొరకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. సైన్స్, ఆర్ట్స్ కళాశాలలో అందుబాటులో ఉన్న ఖాళీల మేరకు తాత్కాలిక పద్ధతిన జూనియర్ లెక్చరర్ / పి జి టి, టి జి టి, స్పెషల్ టీచర్ల కొరకు ఈనెల 23వ తేదీ సాయంత్రం 4 గంటలలోగా లక్షెట్టిపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల,కళాశాలలో కార్యాలయ పని వేళలలో అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. 25వ తేదీన జూనియర్ లెక్చరర్, పి జి టి క్యాడర్ ఖాళీలకు, 27వ తేదీన టి జి టి, స్పెషల్ టీచర్ క్యాడర్ 2 రోజులపాటు ఉదయం 9 నుండి తరగతి బోధన పరిశీలన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జూనియర్ లెక్చరర్, పి జి టి పోస్టులకు యు జి సి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పి.జి. డిగ్రీ తో పాటు బి.ఈడి. అర్హత, టి జి టి పోస్ట్ కు యు జి సి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బి.ఎస్ సి./బి. ఎ./ బి. కాం. డిగ్రీ కనీసం 50 శాతం మార్కులతో పాటు బి. ఈడి. అర్హత కలిగి ఉండాలని తెలిపారు. అభ్యర్థులు నిర్దేశిత తేదీలలో తమ పూర్తి బయోడేటా తో పాటు దృవపత్రాల పరిశీలన కొరకు తమ విద్యార్హతలను తెలిపే ఒరిజినల్ ధ్రువపత్రాలు, ఒక జత నకలు ప్రతులను తీసుకొని లక్షెట్టిపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో సకాలంలో హాజరుకావాలని తెలిపారు. బాలికల విద్యాలయాలలో పనిచేయడానికి మహిళ అభ్యర్థులు మాత్రమే అర్హులని, ప్రకటించబడిన ఖాళీలలో ఎంపిక కమిటీ నిర్ణయానికి లోబడి మార్పులు ఉండవచ్చని తెలిపారు. జిల్లాలో 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయని,పురుషులకు జూనియర్స్ లెక్చరర్ విభాగంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటని, జువాలజీ, సివిక్స్ సబ్జెక్టులలో ఒక్కొక్క పోస్టు, పి.జి.టి. విభాగంలో మ్యాథమెటిక్స్, బయోసైన్స్, సోషల్ స్టడీస్ లో ఒక్కొక్క పోస్టు, ఇంగ్లీష్ లో 2 పోస్టులు, టి.జి.టి. విభాగంలో బయో సైన్స్ ఒక్క పోస్టు, పార్ట్ టైం హిందీ లో 4 పోస్టులు, ఆర్ట్ టీచర్ 2 పోస్టులు, లైబ్రరీ ఒక పోస్టు ఉన్నాయని తెలిపారు. మహిళలకు జూనియర్ లెక్చరర్ విభాగంలో ఇంగ్లీష్, కెమిస్ట్రీ, సివిక్స్ సబ్జెక్టులలో ఒక్కొక్క పోస్టు, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో 2 పోస్టులు, పి.జి.టి. విభాగంలో ఇంగ్లీష్,మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులలో ఒక్కొక్క పోస్టు, టి.జి.టి. విభాగంలో మ్యాథమెటిక్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీ లలో ఒక్కొక్క పోస్టు, హిందీ పార్ట్ టైం 4 పోస్టులు, పి.ఈ.టి, పి.డి. 2 పోస్టులు, మ్యూజిక్ టీచర్, క్రాఫ్ట్ టీచర్, లైబ్రరీయన్, స్టాఫ్ నర్స్ లలో ఒక్కొక్క పోస్టు ఉన్నాయని తెలిపారు. జూన్ 27, 2026 నాడు లక్షెట్టిపేటలో నిర్వహించిన పార్ట్ టైం టీచర్స్ ఎంపిక డెమోకు హాజరైన వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: