ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : దేశానికి గ్రామాలు కన్న తల్లి లాంటి వాని, గ్రామాభివృద్ధికి చేసిన సేవలు కలకాలం గుర్తుండి పోతాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహం లో జరుగుతున్న సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి స్పష్టమైన ప్రణాళికతో వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఆదర్శ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుండి పంచాయతీలకు వచ్చే నిధులపై పూర్తి అవగాహన కలిగి, వాటిని సమర్థంగా వినియోగించి సమగ్ర అభివృద్ధి సాధించాలని సూచించారు. పదవులు తాత్కాలి కమని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని చిరస్థాయిగా పేరు నిలిచేలా అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. గ్రామాల అభివృద్ధికి ఇప్పటికే రూ.237 కోట్లను ప్రభు త్వం మంజూరు చేసినట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి,ఉపసర్పంచులు, సర్పంచులు. సమన్వయంతో ప్రజల గుండెల్లో నిలిచే పనులు చేయాలని సూచించారు. గ్రామస్థాయి మాస్టర్ ప్లాన్ రూపొందిం చుకొని, గ్రామసభల ద్వారా ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధించాలని పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు త్వరలో మంజూరవుతాయని తెలిపారు. పుట్టి పెరిగిన ఊరికి రాష్ట్ర, జాతీయ అవార్డులు సాధించేలా కృషి చేయాలని, ఇష్టంతో కష్టపడి పనిచేయాలని సర్పంచులకు సూచించారు. మహిళా సంఘాల ద్వారా అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో సర్పంచులు భాగస్వాములు కావాలని కోరారు. కటిక పేదరిక నిర్మూలన, చిన్న పిల్లల వివాహాల నివారణలో సర్పంచుల పాత్ర కీలక మని అ న్నారు.అధికారం ఉందని నిధుల దుర్విని యోగానికి పాల్పడవద్దని హెచ్చరించారు. ఈ సందర్భంగా సమ్మక్క సారక్క జాతరకు సర్పంచులను ఆహ్వానిం చారు. అనంతరం శాసన సభ్యులు గండ్ర సత్యనారా యణరావు. మాట్లాడుతూ, ప్రభుత్వ నిధులతో పాటు స్థానిక వనరుల ద్వారా పంచాయతిలకు ఆదాయం సమకూర్చుకునే సమగ్ర కార్యాచరణరూ పొందించాలన్నారు. మూడు నెలలకు ఒకసారి గ్రామ సభలు నిర్వహించి గ్రామాభివృద్ధికి దిశానిర్దేశం చే యాలని సూచించారు. సర్పంచ్ గ్రామ ప్రథమ పౌరు డని,మంచి పేరు తెచ్చుకు నేలా పనిచేయాలని తెలి పారు.ప్రజలు ఇచ్చిన అవ కాశాన్ని సద్వినియోగంచే సుకొని సేవకుల్లా పనిచే యాలని అన్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ శిక్షణలో ఇచ్చిన అంశాలపై పూర్తి అవగా హన కలిగి,అభివృద్ధి,సంక్షే మ కార్యక్రమాల అమలు లో సమగ్ర పాత్ర పోషించా లని సూచించారు. గ్రామా భి వృద్ధిలో సర్పంచు ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ సమావేశం లో ఎస్పీ సంకీర్త్, ట్రేడ్ ప్ర మోషన్ చైర్మన్ ఐత ప్రకాశ్ రెడ్డి, స్థానిక సంస్థల అదన పు కలెక్టర్ విజయలక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, డీపీఓ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News