Thursday, 30 July 2026 03:05:11 PM
# మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం

విద్యార్థుల సంక్షేమం, విద్యాభ్యాసానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం...

జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి

Date : 01 March 2026 09:44 PM Views : 157

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రభుత్వసంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమం, విద్యాభ్యాసానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి భాగ్యవతి తెలిపారు. ఆదివారం మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బాలుర సమీకృత వసతి గృహంపై వెలువడిన వార్తల నేపథ్యంలో ఆదివారం వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడి భోజన సరఫరా, త్రాగునీరు, వసతి, వంటశాల ఏర్పాట్లను పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి మాట్లాడుతూ వసతి గృహంపై వెలువడిన వార్తల నేపథ్యంలో వసతి గృహాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించడం జరిగిందని, హాస్టల్ స్థాయిలో పర్యవేక్షణ, సమన్వయంలో తాత్కాలిక లోపం కారణంగా భోజన సరఫరా, కొంతమంది ప్రాథమిక సౌకర్యాలలో అంతరాయం ఏర్పడినట్లు గమనించడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తక్షణమే సరిదిద్దే చర్యలు చేపట్టడం జరిగిందని, విద్యార్థులకు నిరంతర భోజన సరఫరా, శుద్ధమైన త్రాగునీరు, వసతి, వంటశాల నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం వసతి గృహంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, సంబంధిత వసతి గృహ సంక్షేమ అధికారి, సిబ్బందిని కఠినంగా హెచ్చరించడం జరిగిందని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే బాధ్యులపై శాఖా పరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ రోజు జరిగిన సంఘటనకు బాధ్యులైన వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: