ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రయాణికుల కోరిక మేరకు జగిత్యాల నుండి సారంగాపూర్ జన్నారం మీదుగా అదిలాబాద్ వరకు రెండు ఎక్స్ప్రెస్ బస్సులను డిపో మేనేజర్ కల్పన శుక్రవారం ప్రారంభించారు. ఈ బస్ లలో ఒకటి ఉదయం 8.20 గంటలకు జగిత్యాల నుండి బయలుదేరి ఆదిలాబాద్ కు 12 :20 గంటలకు చేరుకుని తిరిగి 12: 45 కు అదిలాబాదు నుండి బయలుదేరి సాయంత్రం 4:45 నిమిషములకు జగిత్యాలకు చేరు కుంటుంది.2వ బస్సు జగిత్యాల నుండి మధ్యాహ్నం 12:00 గంటలకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు అదిలాబాద్ చేరుకుని తిరుగు ప్రయాణం నాలుగున్నర గంటలకు బయలుదేరి రాత్రి 8:30 గంటలకు జగిత్యాలకు చేరుకుంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని అటుగా వెళ్లే ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Admin
E Nivas News