Thursday, 30 July 2026 08:17:03 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ఆశ్రమ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి

ఐటీడీఏ పీవో మంద మకరందు‌కు తుడుందెబ్బ జిల్లా వినతి

Date : 18 July 2026 09:15 PM Views : 48

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించి, గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని శనివారం తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు కోవ విజయ్ కుమార్ వినతిపత్రం అందజేశారు . శనివారం జిల్లా తుడుందెబ్బ నాయకుల బృందంతో కలిసి ఆయన ఐటీడీఏ పీవో మంద మకరందుని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని పలు ఆదివాసీ గ్రామాల సమస్యలు, పాఠశాలల దుస్థితిపై పీవోకు వినతి పత్రం సమర్పించి,సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా తుడుందెబ్బనాయకులు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మెరుగైన విద్యా ప్రమాణాలు ఆశ్రమ, ప్రాథమిక పాఠశాలల సమస్యలను క్లుప్తంగా వివరించి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూడాలని కోరారు.కనీస సౌకర్యాల కల్పనహాస్టళ్లు, పాఠశాలల్లో తాగునీరు, పరిశుభ్రత, తదితర కనీస వసతులు కల్పించి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.ప్రతిభకు ప్రోత్సాహం గిరిజన విద్యార్థులలో ఉన్న నైపుణ్యాలను, ప్రతిభను గుర్తించి వారిని ప్రభుత్వ పరంగా ఉన్నతంగా ప్రోత్సహించాలన్నారు. ఆదివాసీ సమస్యల పరిష్కారం విద్యా రంగంతో పాటు ఆదివాసీలు ఎదుర్కొంటున్న ఇతర సామాజిక, ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని పీవోను కోరారు. దీనిపై ఐటీడీఏ పీవో సానుకూలంగా స్పందిస్తూసమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తుడుందేబ్బ జిల్లా సలహాదారు కనక ప్రభాకర్, టైగర్ సేనా జిల్లా ప్రధాన కార్యదర్శి మడవి పురుషోత్తం, సోనాపూర్ సర్పంచ్ & తుడుందెబ్బ వాంకిడి మండల ప్రధాన కార్యదర్శి పంద్రం సురేష్, తుడుందేబ్బ వాంకిడి మండల ఉపాధ్యక్షులు సోయం సంజీవ్, దుబ్బగూడ సర్పంచ్ కోవ మోతిరాం, తుడుందేబ్బ కేరామెరి మండల కార్యదర్శి అడ చిన్నూ, ప్రముఖ నాయకులు అడ సోమేష్, మడవి జ్యోతిరాం, కోవ శ్యాంరావు, ఆత్రం మారుతీ మరియు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :