Thursday, 30 July 2026 12:50:48 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

దొంగ నోట్ల చెలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ తెలంగాణ చీఫ్ బ్యూరో

Date : 01 March 2026 08:27 AM Views : 293

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలో కలకలం రేపిన దొంగ నోట్ల చెలామణి దందా ముఠా వివరాలను శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ వెల్లడించారు. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల పెట్రోల్ బంక్ లో బుధవారం స్విఫ్ట్ కార్ లో వచ్చిన కానుగంటి క్రాంతికుమార్ అనే వ్యక్తి రూ. 1500 ల పెట్రోల్ పోయించుకుని వెళ్లగా, అవి దొంగ నోట్లని గుర్తించిన బంక్ సిబ్బంది పెట్రోల్ బంక్ ఓనర్ కు తెలుపగా, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ దొంగ నోట్ల చెలామణిలో ఏ1గా ఉన్నటువంటి కానుగంటి క్రాంతి కుమార్,రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఇటిక్యాలనివాసి. ఇతను ఏ 2 గడికొప్పుల రవీందర్ ఆటో డ్రైవర్, లక్షేట్టిపేట ఏ 3 తాండ్ర ప్రకాష్, ఆర్కె 6 శ్రీరాంపూర్, ఏ 4 కొంక మధుకర్, వెంకట్రావ్ పేట్, ఏ 5 సుంకే సురేష్, గోదావరిఖని, ఏ 6 కామిని అనిల్, పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడ నుంచి దొంగ నోట్లు తెచ్చి చెలామణి చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. కాకినాడకు చెందిన రాము, రవిల నుంచి నకిలీ కరెన్సీ రూ. 5,98,500తెచ్చి చెలామణి చేయడానికి ప్రయత్నించే క్రమంలో స్థానిక పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ఏ7 రాం నాయక్, బెంగులూరు బేకరీ, లక్షేట్టిపేట,ఏ8 నాగునూరి రాము, మోదేలా, లక్షేట్టిపేట, ఏ9 దేవబోయిన సంపత్, బెజ్జంకి, సిద్దిపేట జిల్లా,ఏ10 కడమండ్ల తిరుపతి, జెండా వెంకటాపూర్, ఏ11 గోళ్ళ కుమారస్వామి, పెర్కపల్లి, పెద్దపల్లి జిల్లా,ఏ12 బండారి సత్యనారాయణ,రంగపేట, లక్షేట్టిపేటకు చెందిన వారని ఏసీపీ తెలిపారు. కాగా ఏ 13 రాము, ఏ 14 రవి లు ఇద్దరూ పరారీ లో ఉన్నారని వివరించారు. కాకినాడ నుంచి జరుగుతున్న నోట్ల రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టి విచారణ చేస్తున్నట్లు ఏసీపీ వెల్లడించారు. నకిలీ కరెన్సీ రూ. 5,98,500లతో పాటు నిందితులు వాడిన 3 కార్లు, 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు, ప్రజలు ఈ దొంగ నోట్ల చెలామణి జరుగుతున్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ కోరారు. కేసును చాకచక్యంగా చేధించిన సీఐ రమణ మూర్తి, ఎస్సై లు గోపతి సురేష్, తాజుద్దీన్ సిబ్బందిని ఏసీపీ ప్రకాష్ అభినందించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :