Thursday, 30 July 2026 01:29:25 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలు మానుకోవాలి....

సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్

Date : 20 February 2026 11:17 PM Views : 163

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కాక వెంకటస్వామి పేరు ప్రతిష్టలను అబాస్పాలు చేస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి, మనవడు ఎంపీ గడ్డం వంశీకృష్ణ చేస్తున్న దౌర్జన్యాలు అరాచకాలు ప్రజలు గమనిస్తున్నారని, మీరు ఇలానే చేస్తే ప్రజాక్షేత్రంలో చరిత్ర హీనులుగా మిగిలిపోతారని సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం ఆయన పత్రికల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రజాతీర్పును గౌరవించి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పారదర్శకంగా జరిగేలా చూడాలన్నారు.క్యాతన పెళ్లి మున్సిపాలిటీలో ఈనెల 11వ తేదీన జరిగిన ఎన్నికలలో సిపిఐ, బిఆర్ఎస్ కూటమి 22 స్థానాలలో పోటీ చేసి 14 స్థానాలలో కూటమిని ప్రజలు బ్రహ్మరథం పట్టి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. కాంగ్రెస్ ఏడు స్థానాలలో గెలిచి దొడ్డిదారిన చైర్మన్ పీఠం దక్కించుకోవాలని కుటిల ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటు అన్నారు. కూటమికి మెజార్టీ సభ్యులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ అధికార అహంకారంతో పోలీస్ వారితోటి అధికారులతోటి కుమ్మక్కై చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కాకుండా సమావేశాన్ని రెండుసార్లు వాయిదా వేయడం తోపాటు మా కూటమి అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేస్తూ భయం భంత్రులకు గురిచేస్తూ మున్సిపాలిటీ కార్యాలయంలో నిండు సభలో కౌన్సిల్ సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం 30 నిమిషాలు వాస్ బ్రేక్ అని చెప్పి కాంగ్రెస్ కౌన్సిల్ సభ్యులతో మంత్రి వివేక్ వెంకటస్వామి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ కౌన్సిల్ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి సమావేశాన్ని వాయిదా వేసే విధంగా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా గెలిచిన గుర్రం శ్రీనివాస్ ను ప్రేరేపించి హౌస్ లో గొడవ అయ్యేవిధంగా చేశారని ఆరోపించారు. మా సిపిఐ పార్టీ నుండి 8వ వార్డు అభ్యర్థిగా గెలిచిన మునిని బలవంతంగా మా వైపు రండి అని దాడి చేసి బెదిరించడం జరిగిందన్నారు. సిపిఐ బిఆర్ఎస్ కౌన్సిల్ సభ్యులు అందరూ మంత్రి ని వేడుకుంటూ ఇదేమి సంస్కృతి సార్ మీకు దండం పెడతాము ఎందుకు ఇలా చేస్తున్నారు చెప్పండి అని ఎంత బ్రతిమిలాడిన చోద్యం చేస్తూ చూడడమే తప్ప మరి ఏమి చేయలేని పరిస్థితి తయారయ్యిందన్నారు. తాహశీల్దార్ ప్రత్యేక ఎన్నికల అధికారి సమక్షంలో సిపిఐ పార్టీ నుండి గెలిచిన ఎస్టీ కులానికి చెందిన కౌన్సిల్ సభ్యులు మునిపైన దాడి చేయడం మిగతా మా టిఆర్ఎస్ సీపీఐ కౌన్సిల్ సభ్యులపై దాడి చేస్తుంటే అక్కడ ఉన్న అధికారులు ఏమి తెలియనట్టు ఉండడం గమనార్హం అన్నారు.17న హౌజ్ లో జరిగిన సంఘటన వివరాలను సీసీ ఫుటేజీలను జిల్లా కలెక్టర్ ద్వారా ప్రజాక్షేత్రంలో చూపించా లన్నారు. సి సి ఫుటేజ్ లో వీడియో ద్వారా రికార్డు అయిన సన్నివేశాలను చూసి దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని సిపిఐ డిమాండ్ చేస్తుందన్నారు. 17 న మున్సిపాలిటీ కార్యాలయానికి టిఆర్ఎస్, సీపీఐ చెందిన మా కౌన్సిల్ సభ్యులందరూ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు వెళ్తున్న సందర్భంగా 21వ వార్డుకు సంబంధించిన బబ్బర స్వర్ణలతను పోలీసు లు ఆపి ఆమె కిడ్నాప్ అయిందని వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని, పోలీసులు కావలసికొని సమావేశానికి వెళ్లకుండా అడ్డుకోవడం జరిగిందన్నారు. దీనితో అక్కడ గొడవ మొదలైంది అన్నారు. అంతలోనే అటు నుండి మంత్రి కాన్వాయ్ వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ చెందిన కొందరు కార్యకర్తలు, నాయకులు కావలసికొని రాళ్ల దాడి చేసి శాంతిభద్రతలకు విగాథం కలిగించి లాఠీచార్జ్ అయ్యేవిధంగా కాంగ్రెస్ వారే ప్రేరేపించా రన్నారు. దీనిని బిఆర్ఎస్ చేసినారని వారిపై తప్పుడు కేసులు పెట్టి బాల్క సుమన్ తో పాటు ఇంకొంతమందిపై కేసులు పెట్టి జైలుకు పంపించారన్నారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కేసులు పెట్టిన వారిపై వెంటనే కేసులు ఎత్తివేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌల్, కాదండి సాంబయ్య, వనం సత్యనారాయణ, నక్క వెంకటస్వామి, ఏగుడ మొండి, మహిళా సమాఖ్య పట్టణ కార్యదర్శి గాజుల మణెమ్మ, సిపిఐ నాయకులు, బండారి రాజేశం, కారుకూరి రాయలింగు, గుమ్ముల శ్రీనివాస్, సంకే లక్ష్మణ్, మాదాస్ శంకర్, భాస్కర్, నరేష్, తోకల రాజన్న, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :