ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : జల్ జంగల్ జమీన్ కోసం పోరాడిన ఆదివాసీల ఆరాధ్య దైవం కొమురం భీమ్ పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. కొమురం భీమ్ 85వ వర్ధంతిని పురస్కరించుకుని మంథని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఆదివాసీల హక్కులు, వారి స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కొమురం భీమ్ పోరాటం చేశారన్నారు. నిజాం పాలనలో ఆదివాసులు పశువులను అడవుల్లో మేపితె పన్ను విధించడాన్ని వ్యతిరేకించారు న్నారు. ఆదివాసీలను ఏకధాటిపైకి తీసుకువచ్చి తమ హక్కుల సాధన కోసం నిజాం సైన్యంతో పోరాటం చేసిన కొమురం భీమ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు ఐలి ప్రసాద్, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News