ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : దేశ యువత తమ హక్కుల కోసం ప్రశాంతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే వారిపై బలప్రయోగం జరగడం అత్యంత దురదృష్టకరమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరాన్ని అణచివేయాలని చేసే ప్రతి ప్రయత్నాన్ని ప్రజలుగమనిస్తున్నారనిపేర్కొన్నారు.ఇటీవల ఢిల్లీలో జరిగిన పరిణామాలపై స్పందించిన ఎంపీ వంశీకృష్ణమాట్లాడుతూ, విద్యార్థులు, యువత తమ సమస్యలను శాంతియుతంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే వారిపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్ వంటి చర్యలు చేపట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.దేశ యువతను భయపెట్టి వారి గొంతును అణచివేయడం సాధ్యం కాదన్నారు. ఉద్యోగాలు, విద్య, భవిష్యత్తు కోసం పోరాడుతున్న యువతకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు మా పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.కేంద్ర ప్రభుత్వం యువత ఆవేదనను అర్థం చేసుకుని వారి సమస్యలకు పరిష్కారాలు చూపాల్సిందిపోయి, నిరసనలను అణచివేసే విధానాన్ని అవలంబించడం బాధాకరమని ఎంపీ వంశీకృష్ణ అన్నారు. ప్రజాస్వామ్యంలో విభిన్నఅభిప్రాయాలను గౌరవించడం ప్రభుత్వ బాధ్యత అని దేశ యువత భవిష్యత్తు కోసం తమ గళాన్ని వినిపిస్తూనే ఉంటారని ఆయన అన్నారు.
Admin
E Nivas News