Friday, 31 July 2026 06:22:16 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

22 న రైతు భరోసా నిధులు విడుదల...

Date : 21 March 2026 11:17 PM Views : 140

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా రైతు భరోసా డబ్బులు రేపు జమ కానున్నాయి, యాసంగి, సీజన్ ప్రారంభం నుంచి పెట్టుబడి సహాయం కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మార్చి 22 నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లాలోని రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ సాగు పెట్టుబ డి కోసం రైతులు ఇబ్బంది పడకుండా ఉండాలని,రేపే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నిర్ణయించారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట వేదికగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం స్వయంగా బటన్ నొక్కి ఈ పథకాన్ని ప్రారంభించను న్నారు. ఈ నిధుల విడుదలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. రాష్ట్ర ఖజా నాపై భారం పడకుండా, అదే సమయంలో రైతు లకు సకాలంలో సాయం అందేలా ప్రభుత్వం ఒక పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే మొత్తం నిధులను ఒకేసారి కాకుండా మూడు విడత ల్లో పంపిణీ చేయాలని నిర్ణయించారు. నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకే ఈ నగదు జమ కానుంది. తొలి విడతలో భాగంగా దాదాపు 70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఒక ఎకరం వరకు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతుల ఖాతాల్లోకి ఈ నెల 22న రూ.3,590 కోట్లు చేరనున్నాయి. ఈ విడత పూర్తయిన సరిగ్గా 20 రోజుల తర్వాత రెండో విడత నిధులు విడుదల చేస్తారు. రెండో దశలో సుమారు రూ.2,650 కోట్లను పంపిణీ చేయాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల ఎక్కువ భూమి ఉన్న రైతులకు కూడా ఆర్థిక తోడ్పాటు అందనుంది. ఇక ఏప్రిల్ నెలాఖరు నాటికి మూడో విడత నిధులను కూడా ఇచ్చేసి, ఈ సీజన్ రైతు భరోసా ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయనుంది. మొత్తంగా మూడు విడతల్లో కలిపి సుమారు రూ.9,000 కోట్లు రైతుల చేతికి అందనున్నా యి. గతంలో నిధుల విడు దల ఆలస్యమవడంతో రైతులు పడ్డ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునిఈసారి ఎట్టి పరిస్థితుల్లో నూ ఏప్రిల్ లోపే పంపిణీ పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయం తో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతుకు టుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :