Friday, 31 July 2026 08:12:38 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

విద్యాసంస్థల బంద్ కు (డి.వై.ఎఫ్.ఐ) సంపూర్ణ మద్దత్తు

Date : 09 July 2026 11:50 PM Views : 48

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్రంలో ఉన్న వివిధ విద్యారంగ సమస్యలపై వామపక్ష విద్యార్థి సంఘాలు నిర్వహిస్తున్న రాష్ట్ర బంద్ కు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డి.వై.ఎఫ్.ఐ) కుమురం భీమ్ ఆసిఫాబాద్ కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందని జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్ అన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 27వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదించాలనే ఆలోచనను బేషరుగా మానుకోవాలని అన్నారు. అదేవిధంగా విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని కేటాయించాలని, ముఖ్యమంత్రి ఒక్కడే వివిధ శాఖలను నిర్వహించడంతో నిర్లక్ష్యం వహిస్తున్నారని. తద్వారా విద్యావ్యవస్థ నాశనం అవుతోంది అన్నారు.అలాగే పాఠశాలలు ప్రారంభం అయినా కూడా ఇంకా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు అందించలేదని, అవి తొందరగాఅందించాలని, మధ్యాహ్న భోజన పథకానికి నిధులు పెంచి, అక్షయ పాత్ర, ఇస్కాన్, మన్నా సంస్థలకు కాకుండా మహిళా సంఘాలకు అప్పగించాలన్నారు. ప్రస్తుత దోపిడీ ప్రభుత్వాల వలన సామాన్యుడు బ్రతికి బట్టకట్టే పరిస్థితే లేనప్పుడు ప్రైవేట్, కార్పోరేట్ విద్య సంస్థలు విద్యను వ్యాపారంగా మారుస్తున్నారు. దీనిని అరికట్టి, ఫీజు నియంత్రణ చట్టం చేయాలనిసూచించారు. అలాగే ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈఓ,డిఈఓ మరియు లెక్చరర్స్ పోస్టులను భర్తీ చేయాలని తద్వారా స్థానిక విద్య సంస్థల విద్య పురోగతి సాధిస్తుందని.అలాగే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల చేసి జి.ఓ నెం: 7,8,9 లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ కళాశాలలకు మధ్యాహ్న భోజన పథకాన్ని తక్షణమే ప్రారంభించి, నిధులు కేటాయించాలన్నారు.అద్దె భవనాలలో నడుస్తున్న పాఠశాలలు, హాస్టల్స్, గురుకులాలకు సొంతభవనాలునిర్మించాలని, ప్రతి పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్స్సు ఏర్పాటు చేసి అధునాతన భవనాలను నిర్మించాలని. విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించి,ప్రభుత్వ బడి బస్సులు నడపాలని ప్రతీ విద్యార్థికి ఉచిత బస్ పాస్లు ఇవ్వాలని. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచి, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, ప్రతి పాఠశాలకు కరెంట్, ఇంటర్నెట్, త్రాగునీరు, వంటషెడ్లు,మరుగుదొడ్లు సౌకర్యాన్ని కల్పించాలని, విద్యాసంస్థలలో ర్యాగింగ్ నిరోధక, డ్రగ్స్ నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలి. ఐసీసీ కమిటీలు నియమించాలని, విద్యాహక్కు చట్టం అమలు చేసి, పేద విద్యార్థులకు 25% ఉచిత ప్రవేశాలు కల్పించాలని,రాష్ర్టంలో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని, కాంగ్రెస్ విద్యారంగానికి ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేసి, 5 లక్షల విద్యా భరోసా కార్డులు, ఉచిత లాప్ ట్యాప్లు అందించాలని,ప్రైవేట్, కార్పోరేట్ విద్యాసంస్థలలో విచ్చలవిడిగా పుస్తకాలు, యూనిఫామ్, నోట్బుక్ విక్రయ కేంద్రాలను మూసివేయాలని, నెప్ 2020 తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మాణం చేయాలని తదితర డిమాండ్స్ చేశారు.ఈ కార్యక్రమంలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డి.వై.ఎఫ్.ఐ) జిల్లా సహాయ కార్యదర్శి దుర్గం రాజ్ కుమార్, డి.వై. ఎఫ్.ఐ జిల్లా నాయకుడు రత్నాకర్, భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్.ఎఫ్.ఐ) మండల నాయకులు వినోద్, సుమిత్, ధనుంజయ్, మహేష్, సాగర్తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :