ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : భర్త వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రేకుర్తికి చెందిన కుతాడి కిశోర్, శిరీషారాణి అలియాస్ లహరి(33) భార్యాభర్తలు. కొన్ని రోజుల నుంచి అందంగా లేదని, మరో పెళ్లి చేసుకుంటానని, అదనపు వరకట్నం తేవాలని లహరిని భర్త చిత్రహింసలు పెట్టాడని సమాచారం. సోమవారం భర్త మద్యం తాగి ఇంటికి రాగా మరోసారి గొడవ జరిగడంతో లహరి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కిశోర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Admin
E Nivas News