ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్-బీజాపూర్ హైవేపై ప్రయాణిస్తున్న లారీ, 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందగా పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంతో చేవెళ్ల–వికారాబాద్ రహదారిపై ట్రాఫిక్ జామ్ కాగా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
Admin
E Nivas News