Thursday, 30 July 2026 08:16:23 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం...

సీఎం డిప్యూటీ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

Date : 16 June 2026 09:31 PM Views : 79

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : వృద్ధాప్యంలో ఉన్న సింగరేణి కార్మికులకు ప్రమాద బీమా 30 లక్షలు సహజవనం 10 లక్షల రూపాయలు బీమా కల్పించినందుకు సింగరేణి విశ్రాంత ఉద్యోగులు మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీఎం డిప్యూటీ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు విశ్రాంత ఉద్యోగులు మాట్లాడుతూ 130 సంవత్సరాల సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, అతి తక్కువ కోల్ మైన్స్ పెన్షన్ పొందుతున్న యావత్ సింగరేణిలోని 70 సంవత్సరాల లోపు విశ్రాంత ఉద్యోగులకు (కోల్ మైన్స్ పెన్షనర్లకు) రూ. 30 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యాన్ని, అలాగే సహజ మరణానికి కూడా రూ. 10 లక్షల వరకు బీమా సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ సందర్భంగా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య మాట్లాడుతూతమ సంఘం చేసిన సుదీర్ఘ పోరాట ఫలితంగానే నేడు విశ్రాంత ఉద్యోగులకు ఇంత పెద్ద మొత్తంలో బీమా సౌకర్యం లభించిందని కొనియాడారు. ప్రమాదవశాత్తు ఏ విశ్రాంత ఉద్యోగి అయినా మరణిస్తే, వారి కుటుంబానికి ఈ బీమా ఎంతో ఆసరాను, భరోసాను కల్పిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ బీమా సౌకర్యం కల్పించడంలో సింగరేణి యాజమాన్యానికి పూర్తిస్థాయిలో సహకరిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంకుతో పాటు ఇతర బ్యాంకు యాజమాన్యాలకు ఈ సందర్భంగా ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు రాళ్ళబండి రాజన్న, ప్రధాన కార్యదర్శి పుదారి నర్సయ్య, ఉపాధ్యక్షులు ఏ. గంగయ్య, పుప్పిరెడ్డి రాంరెడ్డి, మేడ రాజలింగు, బూర్ల జ్ఞాని, ఆర్గనైజింగ్ కార్యదర్శి కాటం లక్ష్మణ్, అవదూత శంకరయ్య, సలహాదారులు సత్యనారాయణ రావు, అంజన్న, దేవులపల్లి రామస్వామి, గజెల్లి సుదర్శన్, నాయకులు ఎండీ హుస్సేన్, ఎం.ఎస్. అలీ బేగ్, గురువయ్య, సంగెం రాంచందర్, కొత్తపల్లి రాంబ్రహ్మం, పి. రాజు, మామిడిపల్లి అంజయ్య నాయకులు, విశ్రాంత ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :