Friday, 31 July 2026 07:23:35 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు...

Date : 03 April 2026 11:03 PM Views : 234

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా రెండో విడత నిధుల జమ పైన స్పష్టత ఇచ్చింది. మూడు విడతల్లో రైతు భరోసా నిధులను జమ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందులో భాగంగా తొలి విడత నిధులను విడుదల చేసింది. రెండో విడత నిధులు ఏ కేటగిరీలో రైతుల ఖాతాల్లో జమ చేయనుందో స్పష్టం చేసింది. దీంతో, రైతు భరోసా నిధుల కోసం వేచి చూస్తున్న రైతులకు రిలీఫ్ దక్కనుంది. రైతులకు తెలంగాణ ప్రభుత్వం మరీ కీలక అప్డేట్ ఇచ్చింది. రైతు భరోసా పథకంలో భాగంగా రెండో విడత నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. ఏప్రిల్ రెండో వారంలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం రేవంత్ తాజాగా రైతుల భరోసా నిధుల పైన సమీక్ష చేసారు. రైతులకు ఇచ్చిన హామీ విధంగా నిధులు జమ చేయాలని నిర్దేశించారు. అందులో భాగంగా ఆర్థిక శాఖ రూ.2,650 కోట్లను సమీకరించే పనిలో పడింది. ప్రభుత్వ ఖర్చులు, ఇతర చెల్లింపులతో పాటుగా రైతులకు భరోసా కింద అవసరమైన నిధులు అందించేందుకు అధికారులు కార్యాచరణ సిద్దం చేసారు. రెండో విడతలో ఎకరానికి మించి భూమి ఉన్న రైతులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ముఖ్యంగా సుమారు 5 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులు ఈ దఫాలో ప్రయోజనం పొందనున్నారు. రెండో విడతలో నిధులు దక్కేది వీరికే అందనున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే మొదటి విడతలో ఇప్పటికే 70 లక్షల మంది రైతులకు రూ.3,590 కోట్లను మార్చి 22న జమ చేశారు. దీంతో వ్యవసాయ పనులకు కొంత ఆర్థిక ఊరట లభించింది. మిగతా రైతులకు మూడో విడతలో నిధులు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈనెల చివరినాటికి మొత్తం చెల్లింపులు పూర్తి చేయాలని నిర్ణయించింది. అయితే, ప్రతి సీజన్‌కు ఎకరాకు రూ.6 వేల చొప్పున సాయం అందిస్తున్న ప్రభుత్వం, మొత్తం పథకం అమలుకు దాదాపు రూ.9 వేల కోట్లు అవసరమని అంచనా వేసింది. నిధుల పరిమితి కారణంగా ఈసారి మూడు దశల్లో డబ్బులు విడుదల చేస్తోంది. ఇప్పుడు రెండో విడత నిధుల పైన స్పష్టత రావటంతో పెద్ద సంఖ్య లో రైతులకు ప్రయోజనం దక్కనుంది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :