Thursday, 30 July 2026 08:15:48 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

నవజాత శిశువుకు జన్మనిచ్చిన వారం రోజుల్లోనే తల్లి మృతి..

Date : 15 July 2026 11:41 PM Views : 68

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. నవమాసాలు మోసి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి.. పసికందును గుండెలకు హత్తుకుని మురిసిపోకముందే మృత్యువు ఒడికి చేరింది. ఈ విషాద ఘటన ఖానాపూర్ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో జరిగింది.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శాంతినగర్ కాలనీకి చెందిన ఆయిందాల రుచిత (23) గత వారం నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మంగళవారం ఆమెకు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో ఆరోగ్య పరిస్థితి విషమించింది. వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆమె ప్రాణాలు నిలబెట్టలేకపోయారు. రుచిత భర్త హరీష్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశానికి వెళ్లి ఉన్నాడు. ఈ దంపతులకు ఇప్పటికే నాలుగేళ్ల కుమారుడు ఉండగా, ఇటీవలే పుట్టిన పాపతో కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. అయితే ఆ సంతోషం వారం రోజులు కూడా నిలవకముందే రుచిత మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లి ప్రేమకు దూరమైన నవజాత శిశువు, అమ్మ కోసం ఎదురు చూస్తున్న నాలుగేళ్ల చిన్నారి పరిస్థితి అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఈ విషాద ఘటనతో శాంతినగర్ కాలనీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :