Thursday, 30 July 2026 10:25:10 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ప్రభుత్వ నర్సింగ్ హాస్టల్‌లో ఫోన్లు లాక్కొని విద్యార్థినుల నిర్బంధం

Date : 14 January 2026 10:38 PM Views : 198

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ హాస్టల్‌లో విద్యార్థినుల ఫోన్లు లాక్కొని సంక్రాంతి పండుగకు పంపించకుండా గదుల్లో నిర్బంధించిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటన విద్యార్థినుల స్వేచ్ఛ, భద్రత, మానవ హక్కులపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లోఅదీ బాలికల హాస్టళ్లలో ఇలాంటి చర్యలు చోటుచేసుకోవడం ఆందోళనకరం. పండుగ అనేది కుటుంబాలతో గడిపే సమయం కాబట్టి అలాంటి వేళ, సరైన ప్రకటన లేకుండా విద్యార్థినుల వ్యక్తిగత కమ్యూనికేషన్‌ను ఆపివేయడం, నిర్బంధం వంటి పరిస్థితులు సృష్టించడం నైతికంగా, పరిపాలనపరంగా సమర్థనీయం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి దృష్టికి వెళ్లగానే ఆమె వెంటనే స్పందించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితో ఫోన్‌లో మాట్లాడి, హిందూ విద్యార్థినులను తక్షణమే వారి సొంతింటికి పంపించాలని కోరినట్లు సమాచారం. దీనిపై జిల్లా వైద్యాధికారి వెంటనే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థినులపై పాలకులుగా కాకుండా, సంరక్షకులుగా వ్యవహరించాల్సిన బాధ్యత హాస్టల్ నిర్వాహకులది. నియమాలు ఉంటే అవి స్పష్టంగా, సమానంగా, మానవీయంగా అమలవ్వాలి. మతం, లింగం, నేపథ్యం అనే తేడాలు లేకుండా విద్యార్థినులందరికీ సమాన హక్కులు కల్పించాల్సిందేనని, ఈ ఘటనపై నిష్పాక్షిక విచారణ జరగాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా హాస్టల్ పరిపాలనపై పర్యవేక్షణ పెంచడం, ఫిర్యాదు వ్యవస్థలను బలోపేతం చేయడం అత్యవసరం. విద్యా వ్యవస్థపై ప్రజల నమ్మకం నిలబడాలంటే పండుగ వేళ విద్యార్థినుల కన్నీళ్లు కాకుండా, వారి ముఖాల్లో ఆనందమే కనిపించాలని, ప్రభుత్వం తీసుకునే చర్యలే రేపటి ప్రమాణాలకు అద్దం పడతాయి అనడంలో సందేహంలేదనే సర్వత్ర అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :