Friday, 31 July 2026 09:50:59 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం..

భాజపా రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

Date : 12 May 2026 10:35 PM Views : 91

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : దేశం కోసం ప్రజల కోసం పోరాడే నాయకుడు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు షాద్ నగర్ నుండి కరీంనగర్ వరకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఇటీవలే ఆయనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు షాద్ నగర్ భాజపా రాష్ట్ర నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. పోలీసుల దర్యాప్తు ఇంకా పూర్తికాకముందే, కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వకముందే కొందరు రాజకీయ లాభాల కోసం కావాలనే అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం చాలా బాధాకరమని, ఆరోపణలు వచ్చినంత మాత్రాన ఎవరు తప్పు చేసినట్లు కాదని, మన దేశంలో బలమైన న్యాయ వ్యవస్థ ఉందని, కోర్టులు ఉన్నాయని, చట్టం ఉందని, నిజం ఏదైనా ఉంటే దర్యాప్తు సంస్థలు మరియు కోర్టులే నిర్ణయిస్తాయని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు .దర్యాప్తు పూర్తికాకముందే ఒక ప్రజా నాయకుడిని దోషిగా చిత్రీకరించడం, వ్యక్తిత్వ హననం చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, రాజకీయ కక్షలతో ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నాలు చేయడం తగదని, ప్రజల కోసం నిరంతరం పోరాడుతూ, తెలంగాణలో బిజెపి బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్న నాయకుడు బండి సంజయ్ అన్న, ప్రజా సమస్యలపై ఎప్పుడూ ముందుండే నాయకుడిపై ఇలాంటి ఆరోపణలతో ప్రజల్లో అపోహలుసృష్టించాలని ప్రయత్నించడం దురదృష్టకరమని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి సమక్షంలో, షాద్‌నగర్ ప్రాంతానికి చెందిన దాదాపు 50 మంది నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి మేము కరీంనగర్‌కు వెళ్లి బండి సంజయ్ అన్నను మర్యాదపూర్వకంగా కలిశాము. సుమారు గంటసేపు జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ మరియు ప్రజలకు మరింత దగ్గరగా పనిచేసే అంశాలపై విస్తృతంగా చర్చించాము. ఈ సందర్భంగా మేమంతా బండి సంజయ్ అన్నకు సంపూర్ణ మద్దతు ప్రకటించాము. ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే నాయకత్వానికి షాద్‌నగర్ బిజెపి కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. అసత్య ఆరోపణలు, దుష్ప్రచారాలు ఎంత చేసినా సత్యాన్ని ఆపలేరు. చివరికి నిజమే గెలుస్తుంది, ధర్మమే నిలుస్తుందని పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: