Friday, 31 July 2026 05:33:09 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం...

ఆర్ సి ఓ. సేరు శ్రీధర్

Date : 24 July 2026 11:15 PM Views : 59

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలలో బుధవారం అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ జరిగినట్లు ఎలాంటి నిర్ధారణ కాలేదని,కేవలం అజీర్తి కారణంగా వాంతులు, కడుపునొప్పి వంటి స్వల్ప ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త సేరు శ్రీధర్ శుక్రవారంఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థినులకు పాఠశాలలోనే ప్రథమ చికిత్స అందించినప్పటికీ,వారి ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్త చర్యగా ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు. ఆసుపత్రిలో నిర్వహించిన అన్ని వైద్య పరీక్షల ఫలితాలు సాధారణంగానే వచ్చాయని,ఫుడ్ పాయిజన్‌కు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు గుర్తించలేదని వైద్యులు నిర్ధారించినట్లు తెలిపారు.ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండటంతో ఆసుపత్రి వైద్యులు విద్యార్థినులను 12 నుంచి 14 గంటలలోనే డిశ్చార్జ్ చేసి పాఠశాలకు పంపించారని తెలిపారు.ప్రస్తుతం విద్యార్థినులందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని,అనంతరం వారిని సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 23వ తేది ఉదయం జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్ పాఠశాలలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి విద్యార్థినులందరికీ సమగ్ర ఆరోగ్య పరీక్షలునిర్వహించారనితెలిపారు.మంచిర్యాల జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వాసురామ్ పాఠశాలను సందర్శించి కిచెన్, ఆహార నిల్వ గదులు, పారిశుద్ధ్య పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి,ఆహార నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తంప్రయోగశాలకు పంపించారని తెలిపారు.ఆహార నమూనాల పరీక్షలలో ఏవైనా లోపాలు గుర్తించబడితే సంబంధిత సిబ్బందిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన సమగ్ర నివేదికను సంబంధిత జిల్లా అధికారులు, సొసైటీ ఉన్నత అధికారులకు పంపించడం జరిగిందని,తదుపరి ఆదేశాల మేరకు అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: