ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ఈ నెల 25 వ తేదీ నుండి 31 వ తేదీ వరకు జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు మంథని బస్టాండ్ నుండి మేడారం కు 170 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు TGSRTC Dy. RM(O) భూపతి రెడ్డి, Dy. RM(M) మల్లేశంలు పేర్కొన్నారు. మేడారం జాతర ఏర్పాట్లను TGSRTC Dy. RM(O) భూపతి రెడ్డి, Dy. RM(M) మల్లేశం మంథని బస్టాండ్ ప్రాంగణంలో మహా జాతర ఏర్పాట్లను సందర్షించి ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. మంథని నుండి మేడారం కు పెద్దలకు రూ. 350, పిల్లలకు రూ. 210 చార్జి ఉంటుందని, మహా జాతర ప్రత్యేక బస్సులలో మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని తెలిపారు. టీజిఎస్ఆర్టిసి బస్సులు సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గరి వరకు వెళుతాయని, ప్రవేట్ వాహనాలు గద్దెలకు దూరంగా వెళ్తాయని పేర్కొన్నారు. భక్తులు ఈ సదావకాశాన్ని వినియోగించుకుని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసి సమ్మక్క సారలమ్మ కృపకు పాత్రులు కావాలని కోరారు. వారి వెంట మంథని డిఎం వి శ్రవణ్ కుమార్, మెట్టుపల్లి డిఎం సరస్వతి, వేములవాడ డిఎం శ్రీనివాస్, మంథని డిపో అసిస్టెంట్ మేనేజర్ ఏంజెల్, బస్టాండ్ ఎస్ఎం రవీందర్, కె. కె. రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News