Thursday, 30 July 2026 11:46:46 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

Date : 29 October 2025 10:29 AM Views : 380

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / సిరోల్ : రాష్ట్ర వ్యాప్తంగా మొంథా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అన్ని విభాగాల అధికారులకు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఉదయం రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, పౌరసరఫరాలు, ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల నిర్వహకులు, మున్సిపల్, ఎంపీడీవోలు, ఇరిగేషన్, సంబంధిత అన్ని విభాగాల అధికారులతో కలిసి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మొంథా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రాకూడదని, ధాన్యం వరి పత్తి తదితర ధాన్యాలను తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా రైతులకు సమాచారం అందించాలని సూచించారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వర్షంలో తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు. పశు సంపదకు, పంట, ఆస్తి, ప్రాణ నష్టం కలగకుండా క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ, రైతులను, పశువుల కాపరులను, సామాన్య ప్రజలకు ముందస్తు సమాచారాలు అందించాలని సూచించారు. వర్షాలు తగ్గే వరకు పశువులను మేతకు బయటకు తీసుకుపోకూడదని పశువుల పాకలోనే సురక్షితంగా ఉంచాలని సూచించారు. ప్రమాదకర స్థాయిలో ప్రవహించే జలపాతాలు, చెరువులు, కుంటలు, కెనాళ్ళు, వద్దకు ప్రజలు వెళ్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. లో లెవెల్ వంతెనలు జలాశయాలను డ్యామ్లను చెరువులను తెగిపోకుండా ముందస్తు చర్యలకు సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఇంజనీరింగ్, రెవెన్యూ, పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ నిత్యం సిబ్బంది అందుబాటులో ఉంటారాని, వర్షాలు వరదలు వలన ఎలాంటి ఇబ్బందులు కలిగిన ఈ నెంబర్లు సంప్రదించాలన్నారు. (7995074803) ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా వచ్చిన ఫిర్యాదులకు వెంటనే స్పందించి సహాయక చర్యలు తీసుకుని సంబంధిత సిబ్బందికి సమాచారం అందించి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. విష జ్వరాలు ప్రబలకుండా కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, ముందస్తు చర్యలు చేపట్టాలని తగినన్ని మందులు సిద్ధంగా ఉంచుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అధికారులు, సిబ్బంది కచ్చితంగా వారి ప్రధాన కార్య స్థానంలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని పాఠశాలలకు స్థానిక సెలవు ప్రకటించడం జరిగిందని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: