Friday, 31 July 2026 10:33:04 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

సెంట్రింగ్ యూనిట్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

డిఆర్డిఓ రాథోడ్ రవీందర్

Date : 29 October 2025 07:10 PM Views : 323

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : సెంట్రింగ్ యూనిట్ శిక్షణను సద్వినియోగం చేసుకునే మహిళలకు వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో మొదటి ప్రధాన్యత కల్పిస్తామని ఆదిలాబాద్ జిల్లా డిఆర్డిఓ రాథోడ్ రవీందర్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వారిచే స్వయం సహాయక సంఘ సభ్యులు వారి కుటుంబ సభ్యులకు ఆరు రోజుల శిక్షణలో కార్యక్రమంలోభాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో రెండవ రోజు శిక్షణ కార్యక్రమానికి. ముఖ్య అతిథిగా హాజరైన డి ఆర్ డి ఓ రాథోడ్ రవీందర్ మాట్లాడుతూ. శిక్షణకు హాజరైన మహిళా సంఘ సభ్యులు వారి కుటుంబ సభ్యులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవడం ఒక అదృష్టంగా భావించాలన్నారు.ఈ శిక్షణను సక్రమంగా వినియోగించుకుంటే రాబోయే మూడు సంవత్సరాలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో మంచి ఉపాధి అవకాశాలు పొందవచ్చని అన్నారు. సెంట్రింగ్ నిర్మాణం కోసం కావలసిన సామాగ్రి ముడి సరుకుల కోసం బ్యాంకు స్త్రీ నిధి మండల సమాఖ్య పీఎంఈజీపి పథకాల కింద ఆర్థిక సహాయం అందించడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని శిక్షణకు హాజరైన స్వయం సహాయక సంఘ సభ్యులకు వారి కుటుంబ సభ్యులకు. భరోసా ఇచ్చారు. జిల్లాలోని ప్రతి ఎంపీడీవోకు శిక్షణ పొందిన వారి యొక్క వివరాలను అన్ని మండలాల ఎంపీడీవోలకు పంపించి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సంస్థ ద్వారా శిక్షణ పొందిన స్వయం సహాయక సంఘ సభ్యులకు వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంలో మొదటి ప్రాధాన్యత కల్పించడానికి ఒక సరుకులర్ జారీ చేస్తామన్నారు. సెంట్రింగ్ యూనిట్ శిక్షణను నేషనల్ కాంట్రాక్షన్ ఆఫ్ అకాడమీ ట్రేైనర్ పి మహేష్ శిక్షణకు హాజరైన మహిళలకు వారి కుటుంబ సభ్యులకు సెంట్రింగ్ నిర్మాణ పనులలో ఇన్ని రకాల సెంట్రింగ్ ఉంటుంది వాటిని ఏ విధంగా వాడాలి నాణ్యత ప్రమాణాలు ఎలా పాటించాలో వివరించారు. శిక్షణకు హాజరైన వారి యొక్క సందేహాలను నివృత్తి చేస్తూ ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టంగా శిక్షణ శిక్షకులకు వివరించారు. అనంతరం ఈ శిక్షణకు తీసుకుంటున్న మహిళలకు వారి కుటుంబ సభ్యులకు సెంట్రింగ్ నిర్మాణం సమయంలో భద్రత కోసం కావలసిన హెల్మెట్ డ్రెస్ సామాగ్రి భద్రపరచడానికి కావలసినటువంటి బ్యాగ్ ని టూల్స్ ని ఆర్ డి ఓ రాథోడ్ రవీందర్. న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ పి స్వప్న రాణి చేతుల మీదుగా శిక్షణకు హాజరైన వారికి అందజేశారు. అనంతరం శిక్షణ తీసుకుంటున్న వారితో ఫోటో తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఆర్డిఓ జాదవ గోవిందరావు నాన్ ఫామ్ డిపిఎం వెంకట్ సాయి ప్రసాద్ ఫామ్ ఏపిఎం రా పెళ్లి స్వామి ఎస్విఈపి ఏపీఎంలు మాధవ్ రావు పవర్ గణేష్ న్యాక్ సిబ్బంది రామ్ నారాయణ రమేష్ దీపక్ శిక్షకులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: