ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జెడ్పి సీఈవో డి పురుషోత్తం అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ లో మెప్మా ఆధ్వర్యంలో రిసోర్స్ పర్సన్ 14 మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు.ఈ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మరిపెడ కమిషనర్ రామడుగు విజయనాంద్ తో కలిసి మహిళలకు ఇందిరమ్మ చీరలను అందజేశారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో వీధివిక్రియ దారులకు ప్రభుత్వం నుండి 1216 మంది మహిళలకు సుమారు కోటి 24 వేల రూపాయలు లోన్ ఇప్పించడం జరిగిందన్నారు. మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించడానికి ప్రభుత్వ వారికి చేయూతను అందిస్తుందన్నారు. మహిళా సంక్షేమ పథకాలను దుర్వినియోగం చేయకుండ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెప్మా డీఎంసీ విజయలక్ష్మి, సెమీమ్, పులి ఉమా, గంధసిరి ఉమా, రాజేశ్వరి, రజిత, పార్వతి, ఉమారాణి, లక్ష్మి, స్వరూప, సరిత, మమత, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది ఏకలవ్య, వెంకట్ లాల్, నాగరాజు, ఉపేందర్, అశోక్, శ్రీధర్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News