Friday, 31 July 2026 12:51:33 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపడుతాం

ఏఎంసి చైర్మన్ కుడుదుల వెంకన్న

Date : 05 November 2025 06:35 PM Views : 412

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోళ్లు చేపడుతామని మంథని ఏఎంసి చైర్మన్ కుడుదుల వెంకన్న అన్నారు. బుధవారం మంథని ఏఎంసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసి చైర్మన్ కుడుదుల వెంకన్న సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ ఎక్లాస్ పూర్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎంసి చైర్మన్ కుడుదుల వెంకన్న మాట్లాడుతూ రైతుల ఇబ్బందులు గ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనే వ్యవసాయ మార్కేట్ యార్డును నిర్మించడం జరిగిoదని, దీనిని ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ కొన్ని ప్రత్యేక పరిస్తితుల కారణంగా ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రారంభోత్సవానికి రాలేక పోయారని, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు ఆదేశాల మేరకు ఏఎంసి, ఎక్లాస్ పూర్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారoభించుకోవడం జరిగిందని తెలిపారు. వర్షాలకు ధాన్యం తడిసినప్పటికి రైతులు ఏ మాత్రం అధైర్య పడవద్దని, ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తామన్నారు. ఏ సమస్య వచ్చినా సింగిల్ విండో, ఏఎంసి పాలకవర్గం, సంఘ సిబ్బంది నిత్యం రైతులకు అందుబాటులో ఉండి పరిష్కరిస్తామన్నారు. ధాన్యం విక్రయించిన వెంటనే రైతులకు చెల్లింపులు జరుపుతామని తెలిపారు. ఎన్నికలకు ముందు మానిపేస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు మానిపేస్టో లో పెట్టిన మాదిరిగా కాంగ్రెస్ అధికారంలోకి రావడం తోనే సన్న రకం వడ్లకు క్వింటాల్ కు రూ.500 బోనస్ చెల్లింపు జరిగిందన్నారు. రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం ఉపాధ్యక్షుడు బెల్లంకొండ ప్రకాష్ రెడ్డి, డైరెక్టర్లు ఆకుల రాజబాబు, పెద్దిరాజు ప్రభాకర్, రావికంటి సతీష్ కుమార్, లెక్కల కిషన్ రెడ్డి, కొత్త శ్రీనివాస్, దాసరి లక్ష్మి-మొండయ్య, దేవల్ల విజయ్ కుమార్, ఏఎంసి ఉపాధ్యక్షుడు ముస్కుల ప్రశాంత్ రెడ్డి, ఏఎంసి డైరెక్టర్లు అంకుస్, ఓదెలు, ఊదరి శంకర్, జగన్ మోహన్ రావు, మంథని రాజు, నర్సింగరావు, గడ్డం పోచం, రావికంటి వెంకటేష్, టీజీఈఆర్సి సలహాదారు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎలక్షన్ కో ఆర్డినేషన్ సభ్యుడు శశిభూషణ్ కాచే, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముస్కుల సురేందర్ రెడ్డి, నాయకులు పేరవేన లింగయ్య, బూడిద శంకర్, ఆకుల కిరణ్, పెంటరి రాజు, సాదుల శ్రీకాంత్, ఎరుకల ప్రవీణ్, అరెల్లి కిరణ్ గౌడ్, మంథని శ్రీనివాస్, పర్శవేన మోహన్, ఆర్ల నాగరాజు, అక్కపాక సది, అయిలి శ్రీనివాస్, చొప్పకట్ల హనుమంతు, రాం రాజశేఖర్, సేమంతుల ఓదెలు, దొరగోర్ల శ్రీనివాస్, పెండ్లి ప్రభాకర్ రెడ్డి, పుల్లె రవి, కొండ మహేందర్, బొడ్డు శ్రీనివాస్, పేరవేన రాజేష్, అర్థం సదానందం, నాంపల్లి సతీష్, రాదారపు నితీష్, శైలెందర్, రంజిత్, ఇందారపు సది, మార్కెట్ కమిటి సెక్రటరీ సతీష్, సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్, పెద్ద సంఖ్య లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :