Thursday, 30 July 2026 02:28:33 PM
# మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం

జర్నలిస్టుల హక్కుల సాధనే ప్రధాన లక్ష్యం

Date : 09 November 2025 08:40 PM Views : 254

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : జర్నలిస్టుల హక్కుల సాధనే లక్ష్యంగా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) పోరాటం చేస్తుందని యూనియన్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ అన్నారు. ఆదివారం జైనూర్ మండల కేంద్రంలోని ఏ ఎం సి కార్యాలయంలో నిర్వహించిన యూనియన్ జైనూర్ , సిర్పూర్ యు, లింగాపూర్ మండలాల సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ , జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ సంపత్ కుమార్ జర్నలిస్టులకు సభ్యత్వ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద సంఘ ఇండియన్ జర్నలిస్టు యూనియన్ కు అనుబంధంగా ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జర్నలిస్టుల సభ్యత్వం కలిగిన యూనియన్ గా టియూడబ్ల్యూజే గుర్తింపు పొందిందని అన్నారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలాలు, అక్రిడేషన్ కార్డులు మంజూరు చేసే విధంగా కృషి చేస్తామని అన్నారు. జర్నలిస్టులకు అనారోగ్య, ఇతర ఎలాంటి సమస్యలు ఎదురైనా యూనియన్ అండగా ఉంటుందని గుర్తు చేశారు. జర్నలిస్టులు అవినీతికి తావు లేకుండా విలువలతో కూడిన జర్నలిజం వైపు అడుగులు వేయాలని సూచించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తూ సమాజ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన అతిథులను జర్నలిస్టులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా కోశాధికారి అడప సతీష్ , జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ ప్రకాష్ గౌడ్, సీనియర్ జర్నలిస్టులు నరేందర్ , షేక్ జమిల్ , అన్నరావు ,జిల్లా కార్యవర్గ సభ్యులు రాందాస్, రామేశ్వర్ , పాత్రికేయులు ఆసిఫ్ , ప్రకాష్, రవి, షర్ఫుద్దీన్ , శంకర్ , ఆత్రం రాము , మనోజ్ , శ్రావణ్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జైనూర్ మండలంలోని పట్నాపూర్ కు చెందిన ఆదివాసి రిపోర్టర్ ఆత్రం రాము గత కొంతకాలంగా అనారోగ్యంతో గురైన విషయాన్ని తెలుసుకొని అతనికి వైద్య చికిత్స నిమిత్తం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రూ. 5 వేల ఆర్థిక సహాయం టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ , జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ సంపత్ కుమార్ అందజేశారు. ఆత్రం రాముకు తమ యూనియన్ అండగా ఉంటుందని తెలిపారు. కెరమేరిలో మండల కేంద్రంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా కోశాధికారి అడప సతీష్ , జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ ప్రకాష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రకాంత్, జిల్లా కార్యవర్గ సభ్యుడు రాందాస్, పాత్రికేయులు సంజీవ్, వెంకటస్వామి, ఎజాస్ , బాలాజీ, పద్మాకర్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :