Friday, 31 July 2026 11:41:09 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

బ్యాలెట్ పేపర్ల ముద్రణలో అప్రమత్తంగా వ్యవహరించాలి

జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్

Date : 04 February 2026 10:02 PM Views : 127

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా బ్యాలెట్పేపర్లముద్రణలో అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో బ్యాలెట్ పేపర్ల ముద్రణ కొరకు ఎంపిక చేసిన శారద ప్రింటింగ్ ప్రెస్ ను కలెక్టరేట్ పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్ తో కలిసి ఆకస్మికంగా సందర్శించి ముద్రణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల ప్రక్రియ ముగిసిందని, నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అర్హత గల అభ్యర్థులకు నిబంధనల ప్రకారం ఎన్నికల గుర్తులు కేటాయించడం జరిగిందని తెలిపారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో 240 మంది, బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని 34 వార్డులలో 173 మంది, చెన్నూర్ మున్సిపల్ పరిధిలోని 18 వార్డులలో 107 మంది, క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని 22 వార్డులలో 113 మంది, లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని 15 వార్డులలో 60 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారని తెలిపారు. జిల్లాలోని 1 మున్సిపల్ కార్పొరేషన్, 4 మున్సిపాలిటీలలో మొత్తం 693 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం గుర్తులు కేటాయించడం జరిగిందని, ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యం బ్యాలెట్ పేపర్ల ముద్రణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్, 12వ తేదీన రీపోలింగ్ (ఏమైనా ఉన్నట్లయితే), 13వ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి గెలుపొందిన అభ్యర్థుల ప్రకటన జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: