ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని మున్సిపాలిటి పరిధిలోని 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి లైశెట్టి రజిత-రాజు ఇంటింటిని విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. 8వ వార్డులో బజారులో ప్రజలను నేరుగా కలుస్తూ తనకు మద్దతు తెలపాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సారధ్యంలో ఆయన సూచనల తో 8వ వార్డు వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని, తమను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వార్డులో ఉన్న ప్రజా సమస్యలను తమ సొంత సమస్యలుగా భావించి ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, ఇంటింటికి సన్న బియ్యం, కళ్యాణ లక్ష్మి, రైతులకు రుణమాఫీ, క్వింటాకు 500 రూపాయల బోనస్, వంటి పథకాలు చాలా అద్భుతంగా అమలవుతున్నాయని, జరుతున్న్త అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీని ఆదరించి తమను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వారి వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Admin
E Nivas News