ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / సిరోల్ : మహుబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం రూప్ల నాయక్ తండాలో, చిన్న వయసులోనే అనారోగ్యంతో మృతి చెందిన ఇస్లావత్ రవీందర్ దశ దినకర్మకు ప్రముఖ పారిశ్రామికవేత్త యువ దళపతి ననావత్ భూపాల్ నాయక్ విదేశాల్లో ఉన్న కూడా వెంటనే స్పందించి నిరుపేద కుటుంబానికి పదివేల రూపాయలు,ఒక క్వింటా బియ్యం ను అందజేశారు.కిసాన్ పరివార్ సీరోల్ మండల ఇంచార్జ్ బానోత్ విష్ణు నాయక్ , జిల్లా ఇన్చార్జ్, నియోజకవర్గ ఇన్చార్జిల చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు పదివేల నగదును,రైస్ ను అందజేసి కిసాన్ పరివార్ కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని,భరోసా కల్పించారు. భవిష్యత్తులో కూడా ఇస్లావత్ రవీందర్ కుటుంబానికి అండగా నిలుస్తామని కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించారు.ఈ కార్యక్రమంలో కిసాన్ పరివార్ మండల ఇన్చార్జులు బానోత్ విష్ణు నాయక్,హరిబాబు,ఎడెల్లి వెంకన్న, వెంకటరమణ, తేజావత్ రామ్మూర్తి నాయక్, రవి నాయక్, బానోత్ శంకర్ నాయక్, రామ్మూర్తి, అశోక్, మహేష్, సాయికుమార్, డాక్టర్ అలీ,మూడు సోమాజి నాయక్, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News