ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట, దండేపల్లి మండల కేంద్రాలలో ఏర్పాటుచేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను కలెక్టర్ కుమార్ దీపక్, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, ఆర్డీవో శ్రీనివాస్, ఎన్నికల పరిశీలకులు బుధవారం పరిశీలించారు. లక్షెటిపేటలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లో ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. సామాగ్రి పంపిణీ, ఎన్నికల నిర్వహణ ప్రశాంతంగా జరగాలని అధికారులకు, సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ సరోజ, తహసీల్దార్ దిలీప్ కుమార్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News