ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొత్తూరు జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హాజీపూర్ మండలం సబ్బపల్లికి చెందిన తురుపాటి పౌల్ (44) వ్యక్తి మృతి చెందినట్లు లక్షెట్టిపేట ఎస్సై సురేష్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం మృతుడు వృత్తిరీత్యా గ్రామాల్లో తిరుగుతూ గ్యాస్ స్టవ్ లు రిపేర్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తన వృత్తిలో భాగంగా తనకున్న యూనికాన్ బైక్ పై దండేపల్లి వైపు వెళుతుండగా ఎదురుగా వస్తున్న జీప్ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి 108 అంబులెన్స్ లో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. మృతుని కుమారుడు మనోజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Admin
E Nivas News