ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : వాహన దారులు రోడ్డు భద్రాతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని మరిపెడ సీఐ రాజ్ కుమార్ గౌడ్ అన్నారు. బుధవారం మరిపెడ మండల కేంద్రాంలో లైసెన్స్, నెంబర్ ప్లేట్లు, సరైన పత్రాలు లేని వాహనాలను పట్టుకొని వాహన దారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. వాహనాలను నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలను పాటించాలని సీఐ రాజ్ కుమార్ గౌడ్ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పొలిస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News