ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : దివ్యాంగులలో ఆత్మస్థైర్యాన్ని నింపేలా జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య తెలిపారు. మంగళవారం అంతర్జాతీయ దివ్యాంగులదినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లామహిళ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఆటల పోటీలకు జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి హనుమంత రెడ్డి, జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్ లతో కలిసి హాజరై జెండా ఊపి పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు జిల్లాస్థాయి ఆటల పోటీలు నిర్వహించడం ద్వారా వారిలోఆత్మస్థైర్యాన్ని పెంపొందించడం జరుగుతుందని తెలిపారు. దివ్యాంగ క్రీడాకారులు పోటీలలో నైపుణ్యం ప్రదర్శించాలని, జిల్లాలోని దివ్యాంగులకు జూనియర్స్ (18 సం.ల లోపు బాల బాలికలకు వేరువేరుగా), సీనియర్స్ (18 సం.ల నుండి 54 సం.ల వరకు మహిళలు, పురుషులకు వేరువేరుగా) వివిధ విభాగాలలో ఆటల పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లా స్యిలో గెలుపొందిన విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందని తెలిపారు. అంధులకు రన్నింగ్, షార్ట్ పుట్, చెస్, బధిరులకు రన్నింగ్, షార్ట్ పుట్, జావెలిన్ త్రో, శారీరక దివ్యాంగులకు షార్ట్ పుట్, జావెలిన్ త్రో, క్యారమ్స్, బుద్ధి మాంద్యం దివ్యాంగులకు రన్నింగ్, షార్ట్ పుట్ విభాగాలలో పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, దివ్యాంగ క్రీడాకారులు పాల్గొన్నారు.
Admin
E Nivas News