Friday, 31 July 2026 06:19:37 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ప్రజలు విసిగి వేసారి పోతున్నారు..! రాబోయేది మా ప్రభుత్వమే..

మాట ఇచ్చి తప్పే వ్యక్తిని నేను కాదు..! గులాబీ అధినేత కేసీఆర్

Date : 20 April 2026 11:21 PM Views : 111

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాబోయేది మా ప్రభుత్వమేనని రెండున్నర సంవత్సరాల కాలంలోనే ప్రజలు విసిగి వేసారి పోయారని ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా మళ్ళీ బి.ఆర్.ఎస్ ను గెలిపిద్దామని ఎదురు చూస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి గులాబీ అధినేత కేసిఆర్ అన్నారు. సోమవారం జగిత్యాల పట్టణంలో ప్రజా ఆశీర్వాద యాత్ర లో పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టాక ఎవరికైనా న్యాయం జరిగిందా ఏమైనా ఇచ్చిన హామీలు నిలబెట్టారా అని మాట్లాడుతుండగానే సభలో జనమంతా ఏం చేయలేదంటూ నినాదాలు చేశారు. మన తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలంటే మళ్ళీ మన ప్రభుత్వమే రావాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో నాలుగున్నర దశాబ్దాలు పనిచేసిన జీవన్ రెడ్డి ఈరోజు టిఆర్ఎస్ లో చేరతానంటే నేను వద్దంటానా అని నా మనిషి కాబట్టి ప్రభుత్వం వచ్చాక కీలక బాధ్యతలు అప్పజెప్పతానన్నారు. జగిత్యాలలో జీవన్ రెడ్డిని గెలిపించండి. జీవన్ రెడ్డి తక్కువ మనిషి కాదని ఒక శక్తి అన్నారు. అన్ని డూప్లికేట్ సర్వేలు చేశారని అందులో నిజం లేదన్నారు. తెలంగాణలో యుద్ధం నేన్ చేస్తాం అన్నారు. రైతులను అరగోస పెడుతున్నారని కనీసం యూరియా ఇవ్వాలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. ఎరువుల కోసం యాప్ పెడితే రైతులు తిరిగి తిరిగి వాళ్ల కాళ్లకు వాపులు వచ్చాయి అన్నారు. జీవన్ రెడ్డికి ప్రధాన కార్యదర్శి గా బాధ్యతలు ఇప్పుడే అప్పజెబుతున్నానని తెలిపారు. జీవన్ అన్న సేవలు పార్టీకి అవసరమన్నారు. మన హైడ్రా అడ్రస్ లేకుండా చేస్తా అన్నారు. హైదరా పేరుతో భూకబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. నిరుపేదల ఇండ్లు పూల కొట్టిన వాళ్లకు పేదవాళ్లు ఉసురు కొట్టగా తప్పదన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ పాలనపై నిప్పులు జరిగారు.

ముందుగా జీవన్ రెడ్డికి టిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకం ఉంచి నన్ను పార్టీలో చేర్చుకున్నందుకు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అంతేకాదు ప్రజాపాలన పోవాలి, కేసీఆర్ పాలన రావాలి అన్నారు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :