Friday, 31 July 2026 03:58:35 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

హనుమాన్ జయంతికి లక్షలాదిగా తరలిన భక్తులు...

దేవాదాయ శాఖ నిర్లక్ష్యం కూలిన చలువ పందిళ్ళు..! ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు..

Date : 01 April 2026 11:04 PM Views : 242

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : భక్తుల ఇష్టదైవమైన ఆంజనేయస్వామి కొలువైన కొండగట్టు పుణ్యక్షేత్రానికి హనుమాన్ జయంతి గురువారం జరగనున్న నేపథ్యంలో దీక్షలో ఉన్న లక్షలాది మంది భక్తులు గత ఐదు రోజుల నుండి కాలినడకన పుణ్యక్షేత్రానికి చేరుకుంటున్నారు. దీక్ష విరమించడానికి వచ్చిన భక్తులకు ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన చలవ పందులు ఒక్కసారిగా కూలిపోవడంతో భక్తులు ఆగ్రహావేశాలకు గురై అధికారులను నిలదీశారు. వందల కిలోమీటర్లు నడిచి వచ్చిన భక్తులు కాస్త సేద తీరిన తర్వాత వారి మాల విరమణ చేసి స్వామి వారిని దర్శించుకొని వారి మొక్కులు అప్పజెప్తారు. అలాంటి వారికి దేవదాయ శాఖ సిబ్బంది నిర్లక్ష్యంగా వారి యొక్క పనులను చేయడంతో ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆలయ అధికారులను ఎండ కడుతున్నారు. కోట్లాది రూపాయల ఆదాయం ఉన్న పుణ్యక్షేత్రాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయడం లేదని మొత్తం సిబ్బందితో పాటు పూజారులే మింగేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వచ్చిన భక్తులకు సరిపడా స్నానాలు చేయడానికి నీటి సౌకర్యం లేదని ప్రైవేటుగా వ్యక్తుల వద్దకు వెళ్లి స్నానాలు చేసినట్లయితే రూ. 50 నుండి 100 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారుతున్న కొండగట్టు పుణ్యక్షేత్రం మాత్రం అభివృద్ధి నేర్చుకోలేదన్న అభిప్రాయాలు సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి.

ఆలయ అధికారులు సైతం నామమాత్రంగా పనులు చేస్తూ ఉండడంతో ఏదైనా జరగరాని సంఘటన జరిగినట్లయితే బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. ఇంత నిర్లక్ష్యంగా చలవ పందిళ్లు వేయడం ఎంతవరకు సమంజసమని మండిపడుతున్నారు. ఇప్పటికే పుణ్యక్షేత్రానికి వేలాది మంది భక్తులు చేరుకున్నారు గురువారం హనుమాన్ జయంతి కావడంతో దీక్ష విరమణ చేసి స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం కానున్నారు. ఏది ఏమైనా ప్రతి ఏటా దేవదాయ శాఖ సిబ్బంది కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలు భక్తులు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం ఆంజనేయ స్వామి భక్తుడని అతను కూడా ఇప్పటికే తన సొంత నిధులు ఆలయ అభివృద్ధి కోసం వెచ్చించాడని ఇప్పటికీ పనులు మొదలు పెట్టకపోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :