Friday, 31 July 2026 07:25:11 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త రూల్స్....! ఇక మూడు దశల పరీక్ష తప్పని సరిగా రాయాల్సిందే..

Date : 06 April 2026 12:13 AM Views : 171

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ జారీ విధానంలో కీలకమైన మార్పులు చేసింది. ఇప్పటి వరకు అమలులో ఉన్న రెండు దశల విధానాన్ని రద్దు చేసి, ఇకపై మూడు దశల విధానం ద్వారా మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ పొందేలా కొత్త గైడ్‌లైన్స్ రూపొందించింది. బాధ్యతాయుతమైన డ్రైవర్లను తయారు చేయడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు.ఈ కొత్త విధానం ప్రకారం, లెర్నర్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు తప్పనిసరిగా ప్రభుత్వం నిర్వహించే ఆన్‌లైన్ రోడ్డు భద్రతా అవగాహన కోర్సు పూర్తి చేయాలి. ఈ కోర్సు మొత్తం మూడు గంటల పాటు కొనసాగుతుంది మరియు ఆరు మాడ్యూల్స్‌గా విభజించబడుతుంది. ఇందులో ట్రాఫిక్ నిబంధనలు, సురక్షిత డ్రైవింగ్ పద్ధతులు, ప్రమాదాల ప్రధాన కారణాలు వంటి అంశాలను స్పష్టంగా వివరించనున్నారు. ప్రత్యేకంగా వీడియోల ద్వారా అవగాహన కల్పించడం ఈ కోర్సులో ముఖ్య లక్షణంగా ఉంటుంది. నిజ జీవితంలో జరిగిన రోడ్డు ప్రమాదాల దృశ్యాలను చూపిస్తూ డ్రైవర్లు చేసే పొరపాట్లనుఅర్థమయ్యేలా వివరిస్తారు. అలాగే అద్దాల వినియోగం, ఓవర్‌టేకింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రాత్రి డ్రైవింగ్ విధానం వంటి అంశాలపై కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు.ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులకు ఒక యూనిక్ సర్టిఫికేట్ నంబర్ ఇవ్వబడుతుంది. ఈ నంబర్ ఉన్నవారికే లెర్నర్ లైసెన్స్ కోసం అప్లై చేసే అవకాశం ఉంటుంది. అంటే ఈ ఆన్‌లైన్ కోర్సు పూర్తి చేయకుండా లైసెన్స్ ప్రక్రియలో ముందుకు వెళ్లడం అసాధ్యం. అభ్యర్థులు ఈ పరీక్షను తమ ఇంటి నుంచే కంప్యూటర్ ద్వారా రాయవచ్చు. అలాగే గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూళ్లలో కూడా ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ విధానం ద్వారా దళారీల ప్రభావం తగ్గి, వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 1.7 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచంలో అత్యధిక ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భారత్ కూడా ఒకటిగా ఉండటం ఆందోళన కలిగించే విషయం. అనుభవం లేని డ్రైవర్లు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన లేకపోవడం వంటి కారణాలు ఈ ప్రమాదాలకు దారితీస్తున్నాయి. మూడంచెల విధానం అమలులోకి రావడంతో ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ పొందడం కొంత కఠినంగా మారినా, ప్రజల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. రోడ్డుపైకి రావడానికి ముందు సరైన అవగాహన కలిగి ఉండటం ఎంత ముఖ్యమో ఈ కొత్త విధానం తెలియజేస్తోంది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :