Thursday, 30 July 2026 07:16:43 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

తెలంగాణ రైజింగ్‌తో త్రీ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం...

మంత్రి శ్రీధర్‌బాబు

Date : 15 May 2026 11:02 PM Views : 91

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రైజింగ్‌తో త్రీ ట్రిలియన్ ఎకానమీ కోసం తాము పనిచేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. జహీరాబాద్ లాంటి ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం తాము కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.శుక్రవారంకొండాపూర్ మండలం తొగర్‌పల్లిలో మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహలు పర్యటించారు. రూ.650 కోట్ల పెట్టుబడితో 44 ఎకరాల్లో భారీ ఫుడ్ ఇండస్ట్రీకి మంత్రులు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో టి జి ఐ ఐ సి చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. 1500 మంది స్థానిక మహిళలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా కేజేఎస్ యూనిట్–IIకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడారు. తొగర్‌పల్లిలో ఇంత పెద్ద పరిశ్రమ రావడానికి టీజీ డబల్ ఐఐసి చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కారణమని చెప్పుకొచ్చారు. 1500 మంది మహిళలకు ఈ పరిశ్రమతో ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ పరిశ్రమ పూర్తిగా కాలుష్య రహితమని అన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. రాబోయే కాలంలో అంతర్జాతీయ కారిడార్‌లో ఓ ఇండస్ట్రీ నెలకొల్పుతామని వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో అంతర్జాతీయ సదస్సులో పాల్గొని పరిశ్రమల కోసం పెట్టుబడులను ఆకర్శిస్తున్నామని చెప్పుకొచ్చారు. స్థానిక యువతకు ఉపాధే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని తెలిపారు. రాబోయే కాలంలో 2047 నాటికి దేశ జాతీయ ఉత్పత్తిలో 10 శాతం ఉత్పత్తి పెంచేలా తాము పనిచేస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే మొదట పరిశ్రమలు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఏర్పడ్డాయని మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. మంత్రి శ్రీధర్‌బాబుకి పరిశ్రమల శాఖ తగినవిధంగా సెట్ అవుతుందని తెలిపారు. మెదక్ ప్రజలు చాలా అదృష్టవంతులని చెప్పుకొచ్చారు. వెనుకబడ్డ ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తే ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి లభిస్తుందని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఈ పరిశ్రమ ఏర్పాటు కోసం సహకరించారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. 1500 మంది మహిళలకు ఈ పరిశ్రమతో ఉపాధి లభిస్తుందని అన్నారు. సంగారెడ్డి జిల్లాకు బీహెచ్ఈఎల్ , బీడీల్ , ఓడిఎఫ్ లాంటి కేంద్ర సంస్థలను తీసుకువచ్చామని జగ్గారెడ్డి తెలిపారు..

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :