Friday, 31 July 2026 06:19:11 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

పోడు భూముల రైతులకు పట్టాలు ఇవ్వాలి

రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొండు బాణేష్

Date : 21 October 2025 07:31 PM Views : 336

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : పోడు భూముల రైతులకు పట్టాలు ఇవ్వాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొండుబానేష్ డిమాండ్ చేశారు. సోమవారం మంచిర్యాల జిల్లా భీమిని మండలం అక్కలపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకేఎస్) మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ. ఎస్టీ. బలహీన వర్గాలకు సంబంధించిన పేద రైతులు గత 50 సంవత్సరాలుగా భూములను సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని భూమిని ఆధారంగా చేసుకుని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేద రైతులకు పట్టాలు ఇవ్వాలని రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని పోడు భూముల విషయంలో పట్టాలిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇంతవరకు ఇవ్వకపోవడం రైతుల పట్ల నిర్లక్ష్యం చేయడమేనని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని, పట్టా పాస్ పుస్తకాలు లేకపోవడంతో రైతు భరోసా పంట రుణాలు పొందలేక పోతున్నారని తెలిపారు. బయటి వారి దగ్గర అప్పులు తెచ్చుకొని సాగు వ్యవసాయానికి ఖర్చు చేస్తే అకాల వర్షాల వలన పంట నష్టం జరిగి పంటకు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సాగు రైతులకు పట్టాలు ఇవ్వాలని లేని ఎడల రైతులతో కలసి పట్టాలు వచ్చేవరకు రైతులను కూడగట్టి పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గం రాజేష్ రైతు సంఘం భీమిని మండల కార్యదర్శి చప్పిడి అన్నారావు, దుర్గం ఇస్తారి, జుమ్మడి శ్యామ్ రావు, దుర్గం బిక్కయ్య, చప్పిడి భీమయ్య, బుర్రి సంతోష్, చప్పిడి చిన్నయ్య, జాడి పోచయ్య, చప్పిడి పెంటయ్య, జుమ్మడి సువాస్, చప్పిడి బుద్ధుల్, నజీర్, దుర్గం ఓంకార్, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :