ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మరోసారి సమ్మె సైరన్ మోగనుంది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఆర్టీసీ కార్మికుల వేతనాలు సర్వీస్ సమస్యలు బెనిఫిట్స్ వంటి అంశాలపై దీర్ఘకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించక పోవడం వల్ల సమ్మె ఆందో ళన తీవ్రత మరింత పెరుగ నుంది.ఈ క్రమంలోనే ఆర్టీసీ జేఏసీ నేతలు ఈరోజు లేబర్ కమిషనర్‌తో భేటీ కానుండటంరాజకీయంగా, పాలనాపరంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభు త్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఈ నెల 20వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలని కార్మిక సంఘాలు ప్రాథమికంగా నిర్ణయించాయి. కార్మికులు ఇప్పటికే సమ్మె నోటీసులు ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక చర్చ లకు పిలవకపోవడంపై జేఏసీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. లేబర్ కమిషనర్‌తో జరిగే చర్చల అనంతరం సమ్మెపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. తమ డిమాండ్ల విషయం లో వెనక్కి తగ్గేదే లేదని, ఆర్టీసీని కాపాడుకోవడంతో పాటు కార్మికుల హక్కుల కోసం పోరాటం ఉధృతం చేస్తామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ఒకవేళ చర్చలు విఫలమైతే రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించే ప్రమాదం ఉంది. లక్షలాదిమంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
Admin
E Nivas News