ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : గత నెల 16, 17 వ తేదీలలో క్యాతనపల్లి మున్సిపాలిటీ పాలకవర్గం ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణలపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. క్యాతనపల్లి మున్సిపాలిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నిబంధనలకు విరుద్ధంగా ఎక్స్ ఆఫీసీయో సభ్యుడిగా ఉన్న మంత్రి వివేక్ మాట్లాడేందుకు ఎన్నికల అధికారి అనుమతించడం, కౌన్సిలర్ సభ్యుల మధ్య బారికేడ్ లు ఏర్పాటు చేయకపోవడం, మీడియాను అనుమతించకపోవడానికి గల కారణాలు ఏమిటనే కోణంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ను నివేదిక ఇవ్వాలని ఈసీ కోరింది.ఇప్పటికే క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఎన్నికలో మంత్రి వివేక్, అధికారులు, పోలీసులు అదికార దుర్వినియోగానికి పాల్పడ్డారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు పిర్యాదు చేసి, హైకోర్టును బీఆర్ఎస్ నాయకులు ఆశ్రయించారు.
Admin
E Nivas News