ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : తెలంగాణ ఉద్యమకారుడు గుడిసె గట్టయ్య కన్నాల సర్పంచ్ గా ఎన్నికైన సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం(TUF) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానంచారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు మాట్లాడుతూ ఉద్యమకారుడు సర్పంచిగా ఎన్నికవ్వడం చాలా సంతోషం అన్నారు. అంతేకాకుండా కన్నాల గ్రామపంచాయతీని ఉత్తమ గ్రామపంచాయతీ గా తీర్చిదిద్దాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేలా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా గుడిసె గట్టయ్య మాట్లాడుతూ ఈ సన్మానం ఉద్యమకారులందరి తరపున నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి ఉద్యమకారులకు రావాల్సిన ఉద్యమ ఫలాలను వచ్చే విధంగా మంత్రి శ్రీధర్ బాబు సహకారంతొ తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంథని విజయకుమార్, నియోజకవర్గ అధ్యక్షులు గోగుల రాజిరెడ్డి , తెలంగాణ ఉద్యమ విద్యార్థి జేఏసీ నాయకుడు బెజ్జంకి.డిగంబర్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల ప్రధాన కార్యదర్శి జాడి జంపన్న, వైస్ ఎంపీపీ వేల్పుల గట్టయ్య, ఉద్యమకారుడు తాటి బుచ్చయ్య గౌడ్, మంథని విద్యార్థి యువత అధ్యక్షులు కొండేల మారుతి, బిజెపి నాయకుడు నార మల్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు
Admin
E Nivas News