ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మరిపెడ మున్సిపల్ కేంద్రంలో బస్టాండ్ ఎదురుగా పోస్ట్ యాకుబ్ ఏర్పాటు చేసిన రాగి జావా, జొన్న జావా స్టాల్ శుక్రవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకుల దృష్టిని ఆకర్షించింది. కాంగ్రెస్ నాయకులు రవీందర్ రెడ్డి, గంధసిరి అంబరీష్, గుండగాని వెంకన్న, మరిపెడ వెంకన్న గౌడ్ లు స్టాల్‌కు విచ్చేసి రాగి జావా, జొన్న జావా రుచి చూశారు. వీరు ఈ జావాలను తాగిన తర్వాత అద్భుతంగా ఉందని, రుచికరంగా ఉందని మెచ్చుకున్నారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉదయాన్నే రాగి జావా, జొన్న జావా తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇవి పోషకాలతో నిండినవి, శక్తినిస్తాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. నేటి గజిబిజి జీవితంలో సరైన ఆహార అలవాట్లు పాటించకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సమయంలో ఇలాంటి ఆరోగ్యకరమైన రాగి, జొన్న జావా స్టాల్ ఏర్పాటు చేయడం అభినందనీయం అని పేర్కొన్నారు. ప్రజలందరూ ఉదయాన్నే ఇలాంటి సహజ ఆహారాలను అలవాటు చేసుకోవాలని,ఈ స్టాల్‌ను సందర్శించి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు.ఆరోగ్య స్పృహతో ముందుకు వస్తున్న పోస్ట్ యాకుబ్ ప్రయత్నాలకు అందరూ అభినందనలు తెలుపుతున్నారు.
Admin
E Nivas News