Friday, 31 July 2026 07:24:47 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలి..

జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

Date : 03 March 2026 02:42 AM Views : 181

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ తెలిపారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో (స్థానిక సంస్థలు, రెవెన్యూ) అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె.అనిల్ కుమార్ తో కలిసి కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి వినతులనుస్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తమ పరిధిలోఉంటేసత్వరమే పరిష్కరించాలని, లేనిపక్షంలో సంబంధిత విభాగాలకు సిఫారసు చేసి సమస్య పరిష్కారం చేయుటకు కృషి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాలు, విద్యాసంస్థలలో మండల ప్రత్యేక అధికారులు ప్రతి 15, రోజులు లేదా మాసంలో మూడు దఫాలుగా వారికి కేటాయించిన హాస్టల్లో తనిఖీ చేసి విద్యార్థులతో స్వయంగా మాట్లాడి అందుతున్న మౌలిక వసతులు విద్యా బోధనల గురించి వివరాలు అడిగి తెలుసుకొని తనకు నివేదిక సమర్పించాలని సూచించారు, ప్రతి విద్యా సంస్థలలో పిల్లలకు హెల్త్ ఎడ్యుకేషన్ న్యూట్రిషన్ సానిటేషన్ లపై ఎలాంటి జాప్యం లేకుండా సౌకర్యాలు కల్పించాలని, షెడ్యూలు ప్రకారం విద్యార్థిని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మానసిక ఆరోగ్య స్థితిగతులను గమనిస్తూ ఉండాలని తెలిపారు. పదవ తరగతి పరీక్షలు వస్తున్న నేపథ్యంలో టైం టేబుల్ ప్రకారం ప్రత్యేక తరగతులు నిర్వహించి జిల్లాలో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని, పరీక్షా కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు ఉండే విధంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో అమలవుతున్న ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను తనిఖీ చేస్తూ అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ దశల్లో ప్రత్యేక చొరవ తీసుకొని లబ్ధిదారులకు తక్షణ సేవలను అందించాలన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ఈ క్రింది విధంగా లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. గార్ల మండలం బాలాజీ తండ పంచాయతీ కి చెందిన భూక్య శాంతి తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయినదని సాంకేతిక కారణాలతో బిల్లు మంజూరు కావట్లేదని తన సమస్య పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు. మరిపెడ మండలానికి చెందిన గోలి మృత్యంజయ తన ఇంటికి సమబందించి పన్ను గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా ఎక్కువగా వచ్చిందని సమస్య పరిష్కరించి న్యాయం చేయాలని అన్నారు. మహబూబాబాద్ మండలం డి.ఎస్.ఆర్ జండాల తండ గ్రామానికి చెందిన గ్రామస్తులు తమ గ్రామ పరిధిలో 5 తండాలు ఉన్నాయని అట్టి తండాలకు మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు నిర్మాణం చేయాలని కోరారు. మరిపెడ మండలం తానంచర్ల గ్రామానికి చెందిన పి.సునీత ఇందిరమ్మ ఇండ్ల రెండవ దశ నిర్మాణం బిల్లు మంజూరు చేయవలసిందిగా కోరారు. బయ్యారం మండలం గౌరారం గ్రామానికి చెందిన వెంకటాద్రి తాను దీర్ఘకాలిక వ్యాది పక్షవాతం తో భాదపడుతున్నానని బతుకుదెరువుకు ఆధారం ఏమి లేదని వికలాంగుల పెన్షన్ ఇప్పించి ఆదుకోవాలని అన్నారు,బయ్యారం మండల కేంద్రాన్ని నియోజకవర్గంగా మార్చుటకు సిఫారసు చేయాలని, నియోజకవర్గ సాధన కమిటీ సభ్యులు దరఖాస్తు చేశారు. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి లో (107 ) దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు సత్వర పరిష్కారానికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ రెవిన్యూ డివిజనల్ అధికారి క్రిష్ణవేణి, డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, జెడ్పి సీఈవో పురుషోత్తం, డివిహెచ్ఓ డాక్టర్ కిరణ్ కుమార్, డిపిఓ హరిప్రసాద్, ఎక్సైజ్ ఎస్పి కిరణ్ కుమార్, ఉద్యాన శాఖ అధికారి మరియన్న, ఎస్సీ, బీసీ, మైనారిటీ సంక్షేమ అధికారులు శ్రీనివాసరావు, శ్రీనివాస్,అన్ని విభాగాల జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్ తదితరులుపాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: