Friday, 31 July 2026 12:29:10 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

అసెంబ్లీకి కేసీఆర్ మళ్లీ దూరం...

Date : 18 March 2026 07:44 AM Views : 212

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ బడ్జెట్ సమావేశాల తొలిరోజే అసెంబ్లీలో రాజకీయ వేడి రాజుకుంది. బీఆర్ఎస్ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈసారి కూడా సభకు గైర్హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా ఆయన వస్తారని అందరూ భావించినా, కేసీఆర్ రాకపోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కండువాలు, నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు హాజరయ్యారు. బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు నేతృత్వంలో గులాబీ శ్రేణులు సభలో నినాదాలతో హోరెత్తించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగిస్తున్న సమయంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కాలుష్య కారక పరిశ్రమలకు సంబంధించిన 'హిల్ట్ పాలసీ'ని గవర్నర్ ప్రస్తావించగానే ఇది పెద్ద కుంభకోణమని హరీశ్‌రావు హిందీలో అరిచారు. పెట్టుబడుల సమ్మిట్‌పై గవర్నర్ చదువుతున్న అంశాలన్నీ అబద్ధాలని, ప్రభుత్వం ఆయనతో తప్పుడు మాటలు చెప్పిస్తోందని ఆరోపించారు. సభలో మరో ఆసక్తికర దృశ్యం కనిపించింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీ కండువా లేకుండానే సభకు హాజరయ్యారు. వారంతా అధికార కాంగ్రెస్ సభ్యుల పక్కనే కూర్చోవడం విశేషం. కాంగ్రెస్, బీజేపీ సభ్యులు తమ పార్టీ కండువాలతో మెరవగా, మజ్లిస్ సభ్యులు సంప్రదాయ షేర్వానీలతో కనిపించారు. అసెంబ్లీ లాబీల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేలకే చేదు అనుభవం ఎదురైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మందుల సామేలు, కవ్వంపల్లి సత్యనారాయణలను గన్‌మెన్లు అడ్డుకున్నారు. సీఎం చాంబర్ వద్ద కూడా ఇలాంటి ఆంక్షలు ఉండవని, తమను లోపలికి వెళ్లనివ్వకపోవడంపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే అదే సమయంలో మరో ఎమ్మెల్యే విజయరమణారావును మాత్రం గన్‌మెన్లు అడ్డుకోకపోవడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :