Friday, 31 July 2026 01:16:55 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

పోలీసులకు శుభవార్త చెప్పిన డీజీపీ శివధర్ రెడ్డి

Date : 28 April 2026 10:11 PM Views : 128

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ పోలీసు శాఖ సిబ్బందికి డీజీపీ బి. శివధర్ రెడ్డి శుభవార్త తెలిపారు. పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇకపై ప్రతి పోలీసు ఉద్యోగికి వారి పుట్టినరోజు మరియు వివాహ వార్షికోత్సవం రోజున ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు విధుల్లో తీవ్ర ఒత్తిడిలో పనిచేస్తూ వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించలేకపోతున్నారని గుర్తించిన డీజీపీ, వారి మానసిక ఉల్లాసం, కుటుంబ బంధాలు బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన సందర్భాలను ఆనందంగా గడిపే అవకాశాన్ని కల్పించడమే లక్ష్యమన్నారు. అత్యవసర పరిస్థితులు మినహా అన్ని యూనిట్ అధికారులు సంబంధిత సిబ్బందికి సెలవులు మంజూరు చేయాలని ఆదేశించారు. సరైన ఆధారాలు, ముందస్తు దరఖాస్తు ఆధారంగా ఈ సెలవులు మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేశారు. డీజీపీ తీసుకున్న ఈ నిర్ణయంపై పోలీసు సిబ్బందిలో ఆనందం వ్యక్తమవుతోంది. తెలంగాణ పోలీసు శాఖలో ఇది మరో సంక్షేమ చర్యగా నిలిచే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :